Telugu News

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

◆ మంత్రి పువ్వాడ ఆదేశాలతో అదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.

0

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
◆ మంత్రి పువ్వాడ ఆదేశాలతో అదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.
◆ హర్షం వ్యక్తం చేస్తున్న ఏపి, తెలంగాణ ప్రయాణికులు.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికులు ఇప్పటినుంచే సొంతుళ్లకు పయనమవుతున్నారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఆయా ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు. పండగకు సమీపిస్తుండటంతో బస్సులను ఆయా ప్రాంతాలకు అధికారులు సిద్దం చేశారు. ఇప్పటికే రాష్ట ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించబడంతో పల్లెలకు వెళ్లేందుకు పట్నం వాసులు సిద్ధమవుతున్నారు. తెలుగు వారికి అతి పెద్ద పండగ కావడంతో ప్రజలు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. ఇక సోంతుళ్లకు వెళ్లే వారితో నగరంలో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

also read :-ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా 

ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. జనవరి 8 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నాయి.
టీఎస్ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన్నట్లు అధికారులు వెల్లడించారు. అదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉండనుందన్నారు. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం ఏ విధమైన అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని ప్రకటించారు. ఈ చర్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.