Telugu News

పాతపాల్వంచలో మరో విషాదం.. రామకృష్ణ చిన్న కూతురు మృతి

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన సాహితి

0

రామకృష్ణ చిన్న కూతురు మృతి
** చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన సాహితి
** పాతపాల్వంచలో మరో విషాదం
(భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి-విజయంన్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ మరో విషాదం నెలకొంది. రామకృష్ణ చిన్న కూతురు చికిత్స పొందుతూ బుధవారం ఆసుపత్రులో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.   Allso read :- పాత పాల్వంచలో ముగ్గురు సజీవదహనం.. మరోకరి పరిస్థితి విషమం

పూర్తి వివరాల్లోకి వెళితే పాత పాల్వంచ పట్టణంలో నివాసం ఉంటున్న రామకృష్ణ అప్పుల బాధతో ఆదివారం రాత్రి తన కుటుంబంతో సహా గ్యాస్ లీకేజ్ చేసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాఠకులకు తెలిసిందే. ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్యతో పాటు ఒక కూతురు మృతి చెందగా సాహితి అనే రామకృష్ణ చిన్న కూతురు తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉండగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు తెలిసింది. దీంతో రామకృష్ణ కుటుంబమంతా మృతిచెందారు. అత్యంత హృదయవిదారకమైన ఈ సంఘటన పాల్వంచలో చోటుచేసుకోవడంతో పాత పాల్వంచ విషాదం నెలకొంది.

allso read:- వనమా రాఘవను అరెస్ట్ చేయాలి : భట్టి