Telugu News

పోట్ల శ్రీకాంత్ ఘన విజయం

జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో పోట్ల శ్రీకాంత్ గెలుపు

0

జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో పోట్ల శ్రీకాంత్ గెలుపు

— బారీ ఓట్ల మెజారిటీతో గెలుపు
— శ్రీకాంత్ ప్యానల్ వెట్ వాస్

(ఖమ్మం -విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో ఉన్న జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో పోట్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. కార్యదర్శి పదవి కోసం పోట్ల శ్రీకాంత్ ప్యానల్, అలాగే పోటు శరత్ కుమార్ ప్యానల్ పోటీపడగా ఆదివారం పోలింగ్ జరిగింది అందుకుగాను మొత్తం 2915 ఓట్లకు గాను 2135 ఓట్లు పోలయ్యాయి. కాగా సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు పూర్తి కాగా పోట్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. ఆయన ప్యానల్ లో ఉన్న సహాయకార్యదర్శి గంగిశెట్టి వెంకటేశ్వర్లు సమీప ప్రత్యర్థి మక్తాల వెంకటేశ్వర్లు పై 690 ఓట్ల మెజారిటీ తో విజయం సాదించారు. హోరాహోరీగా జరుగుతున్న లెక్కింపులో భారీ మెజార్టీతో శ్రీకాంత్ ప్యానల్ ఏకపక్షంగా క్లిన్ సీట్ చేసినట్లు తెలుస్తోంది.. పదిమంది సభ్యులు ఏకపక్షంగా గెలిచింది. శరత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.. టపాసులు కాల్చి..స్వీట్లు పంచుకున్నారు..శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీకాంత్ వరసగా రెండవ సారి విజయం సాధించారు.