Telugu News

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన ఖమ్మం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు

ఖమ్మం-విజయంన్యూస్

0

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన ఖమ్మం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు
(ఖమ్మం-విజయంన్యూస్);-
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావీద్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన్ను కలిసి మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాలపై వారు చర్చించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టిన అటువంటి సభ్యత్వ నమోదు గురించి చర్చించారు. ఇంకా జిల్లా కు సంబందించిన పలు రాజకీయ అంశాలపైన చర్చించినట్టు దుర్గాప్రసాద్, ఎండీ జావేద్ తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి వారికి చూపించారు.

please subscribe this chanel smiling chaithu