Telugu News

ఉపకార వేతనాలు, ఫీజు బకాయిల విడుదలకై పిడిఎస్యు చలో కలెక్టరేట్.

విద్యార్థులతో అట్టుడికిన ఖమ్మం కలెక్టరేట్

0

ఉపకార వేతనాలు, ఫీజు బకాయిల విడుదలకై పిడిఎస్యు చలో కలెక్టరేట్.

విద్యార్థులతో అట్టుడికిన ఖమ్మం కలెక్టరేట్

విద్యార్థుల బాకీ ఎప్పుడు తెరుస్తావ్ కెసిఆర్

జిల్లాకు యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో మోక్షం ఎప్పుడు?

టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పిడిఎస్యు నాయకులు శరత్, ఆజాద్.

విద్యార్థుల బాకీ కెసిఆర్ ఎప్పుడు తీరుస్తావని వారు పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శరత్, జిల్లా అధ్యక్షులు అజాద్ లు ప్రశ్నించారు.

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని, జిల్లాకు యూనివర్సిటీ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్,బాబురావు పెట్రోల్ బంక్, పాత ఎల్ఐసి ఆఫీస్, జడ్పీ సెంటర్ మీదుగా వేలాదిమంది విద్యార్థులతో స్కాలర్షిప్ విడుదల చేయాలని, రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, మెడికల్ కళాశాల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శరత్, జిల్లా అధ్యక్షులు అజాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ మీద ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు, గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వారు అన్నారు. విద్యార్థులకు రాజ్యాంగపరంగా రావలసిన స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంగా చేసి, రాష్ట్రంలో ఉప ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం కెసిఆర్ నేడు పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు వేల కోట్ల రూపాయల పైగా పెండింగ్లో ఉన్నాయని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రము లో విద్యార్థుల భవిష్యత్తును ఎండమావిగా తయారు చేశారని ఇది సరైనది కాదని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయటం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని వారు ఆక్రోశం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆర్ కు పదవుల మీద ఓట్ల మీద అ నోట్లమీద ఉన్నటువంటి ప్రేమ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థుల పైన లేదని వారు విమర్శించారు. పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.

పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని దశాబ్దాలుగా పాలకులు వాగ్దానాలకు పరిమితమైనది తప్ప ఆచరణలో అమలు కాలేదని వారు అన్నారు. ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ గారు ప్రకటనలు ఆచరణలో మాత్రం అమలు కాలేదని ప్రతి సంవత్సరం విద్యార్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలమంది ఉన్నత చదువులకు ఇతర జిల్లాల యూనివర్సిటీలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని జిల్లాలో ఉంటే ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని వారు అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల యూనివర్సిటీ మెడికల్ కళాశాల కల నెరవేరుతడి అనుకున్న సమయంలో పాలకులు రానీయకుండా అడ్డం తిరుగుతున్నారని ఇది సరైనది కాదని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మస్తాన్, నవీన్, సహాయ కార్యదర్శి నవ్య జిల్లా కోశాధికారి కిరణ్, నాయకులు మురళి, దీపిక,లక్ష్మణ్, శేశి, సతీష్,విశ్వనాథం, వినయ్, ఉమ, రమ్య, ప్రియాంక, రాకేశ్,శివ, సతీష్,సాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

also read :- రాజ్యసభలో 12మంది ఎంపీలు సస్పెండ్.