Telugu News

రైతుబంధు సమితి క్యాలెండర్ ను అవిష్కరించిన ఎంపీపీ

కూసుమంచి-విజయంన్యూస్

0

రైతుబంధు సమితి క్యాలెండర్ ను అవిష్కరించిన ఎంపీపీ
(కూసుమంచి-విజయంన్యూస్);-
కూసుమంచి రైతు వేదిక నందు రైతు బందు సమితి క్యాలెండర్ ను ఎంపీపీ బానోతు శ్రీనివాస్, కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ్ చంద్ర, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కంచర్ల వీరా రెడ్డి రైతుబంధు సమితి మండల కన్వీనర్ రామ్ కుమార్ లు అవిష్కరించారు.

also read :-***అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి……

ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల పై ఎంతో చిత్తశుద్ధితో రైతు బంధు రైతు బీమా వంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పథకాలను ప్రవేశపెట్టి రైతుల యొక్క మన్ననలు పొందుతుందని తెలియజేయడం జరిగింది.కూసుమంచి సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్ర మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా రైతు బంధు కమిటీల ద్వారా మా దృష్టికి తీసుకొని రావాలని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి ఆర్ వాణి మాట్లాడుతూ రైతు బంధు సమితులు రైతులకు వ్యవసాయ శాఖ కి మధ్య ఒక వారధిగా ఉండాలని తెలియజేశారు,.

also read :-రామానుజచార్య విగ్రహాన్ని దర్శించిన ఎమ్మెల్యే కందాళ

రైతుబంధుసమితి జిల్లా సభ్యులు వీరా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజుగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. మండల కో ఆర్డినేటర్ రామ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖలో ఏ శాఖలో లేనటువంటి ఉద్యోగులను నియమించి రైతులకు ప్రభుత్వ పథకాలను అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ సెట్రం నాయక్, అజీజ్ వివిధ గ్రామ కోఆర్డినేటర్లు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొనడం జరిగింది