మీ బైక్పై పెండింగ్ చలాన్లు ఉన్నాయా?
హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
(హైదరాబాద్ విజయం న్యూస్):-
వాహనదారులకు శుభవార్త. పెండింగ్ చలాన్లను రాయితీ ఇచ్చేందుకు కరసత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 30 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సమాచారం. కార్లు, బైక్లు, ఆటోలు, లారీలు, బస్సుల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాయితీపై దస్త్రాన్ని డీజీపీకి పంపేందుకు సిద్ధం చేశారు. డీజీపీ మహేందర్రెడ్డి రెండువారాలు సెలవులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో దస్త్రంలో పెండింగ్లో పడింది.
also read :-సరికొత్త ఒరవడితో.. ఖమ్మం ప్రభుత్వ బడులు
అయితే, ద్విచక్ర వాహనదారులకు 75శాతం, కార్లకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉంది. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు అధికారులు రాయితీ ప్రతిపాదన తీసుకువచ్చారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు ప్రజలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. 85శాతం మంది మధ్య తరగతి, దిగువ మధ్య, పేదలు ఉండడంతో వారికి చలాన్లు భారం కావడంతో వారికి ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.