గురుకుల పాఠశాలలో అమానుషం
== విద్యార్థిని ఎగిరితన్నిన టీచర్
== టీచర్ ను నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు
== గురుకుల పాఠశాల ఎదుట ధర్నా చేసిన తల్లిదండ్రులు
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 28(విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం గురుకుల పాఠశాలలో అమానుషం జరిగింది. అనేక సంఘటనల్లో విద్యార్థులపై దాడి చేసి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటున్నప్పటికి కొందరు ఉపాధ్యాయులు వారి తీరు మార్చుకోవడం లేదు. గురుకుల పాఠశాలలో ఫ్రైడ్ రైస్ తింటున్న 6వ తరగతి విద్యార్థిపై ఓ మాస్టార్ చేసి నిర్వాహకం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : బిజెపి నేతలు చర్య దుర్మార్గమైనది: మంత్రి పువ్వాడ
ఉపాధ్యాయుడు లెక్కలేని తనంతో తల్లిదండ్రులపై దుర్భషలాడుతుండటంతో ఆ తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించిన సంఘటన ఆదివారం పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్ల గ్రామంలో మహత్మ జ్యోతి బాపులే తెలంగాణ సంక్షేమ గురుకులపాఠశాల ఉంది. అక్కడ చదువుతున్న విద్యార్థులను చూసేందుకు ఆదివారం తమ తల్లిదండ్రులు వస్తుంటారు. అయితే ఆరోవ తరగతి చదువుతున్న త్రినేష్ ప్రైడ్ రైస్ తింటుండగా ఓమాస్టార్ ఆ విద్యార్థిని మెడపట్టుకుని నెట్టి తన్నినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైడ్ రైస్ తింటుంటే ఎందుకు కొట్టారు అంటూ ఓ టీచర్ ను తోటి విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో ఆ మాస్టారు వక్రబుద్దిని చూపించి దుర్భుషాలాటకు దిగటంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన దిగారు. దీంతో ఆ టీచర్ పరారైనట్లు తెలుస్తోంది. ఆందోళన కారులతో తోటి ఉపాధ్యాయులు, పోలీసులు సర్థిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మానవత్వం చాటుకున్న కూసుమంచి ఎంపీపీ