Telugu News

“పంచముఖ పోరులో పాలేరు-అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్న ప్రజలు”

లోడిగ వెంకన్నయాదావ్- సామాజిక వేత్త. పాలేరు.

0

“పంచముఖ పోరులో పాలేరు-అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్న ప్రజలు”

 

== లోడిగ వెంకన్నయాదావ్- సామాజిక వేత్త. పాలేరు.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పాలేరు నియోకవర్గం చరిత్ర కు పెట్టింది పేరు.అక్షర అభ్యాసం లేని పొట్టపెంజర హుస్సేనయ్య వద్ద నుండి నేటి వరకు ఊహకు అందని అభ్యర్థుల ఎంపిక కు నిలయంగా మారింది పాలేరు.! జిల్లా కు స్వాగత సుమాంజలితో పాలేరు ఉమ్మడి ఖమ్మం జిల్లా కు ముఖద్వారం కావటం కారణంగా అనేక మంది పాలేరు పొలిమరలో అడుగు పెట్టండం వలన పాలేరు కు ప్రాదాన్యత సంతరించుకుంది.! కారణాలు ఏమైనప్పటికీ రాజకీయ భవిష్యత్ కు అదృష్ట అడ్డాగా పాలేరు మారిపోయింది.! ఇక్కడి నుండి పోటీ చేసిన ప్రతీఒక్కరిది ఇదేచరిత్ర. దీని కారణంగా పాలేరు నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచింది. దీనిలో భాగంగానే ఇప్పుడు పాలేరు ఒక హాట్ టాపిక్ గా మారింది.!

allso read- సిటి బస్టాండ్ గా ‘ఖమ్మం పాత బస్టాండ్’

స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందరెడ్డికి తోడు ఈ సారి నూతనంగా అదృష్టాన్ని పరీక్షించు కోటానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు   షర్మిల తన తొలి అడుగు పాలేరు నుండి పోటీచేయటానికి రంగం సిద్దం చేసుకొంటుంది. టీఆరెస్ పార్టీ వామపక్షాల కలయికతో మునుగోడు ఎన్నికల బరిలో నిలిచి ఉభయ కమ్యూనిస్టులు మా వెంటే ఉంటారు అని కేసీఆర్ బహిరంగ ప్రకటన తో సిపిఎం కు మరల పాలేరులో చిగురులు మొలకెత్తి పొత్తు లో భాగంగా పాలేరులో మేము పోటీ చేస్తాము అని శ్రీ తమ్మినేని వీరభద్రం గారు సభలు సమావేశాలు పెట్టి చెపుతున్నారు. చివరి వరకు ఎవరు పోటీ చేస్తారో తెలియని విచిత్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయినప్పటికీ ప్రజలతో మమేకం అయి గ్రామాల్లో కార్యకర్తలకు భరోసాను నింపుతూ కాంగ్రెసు పార్టీ నుండి నేను పోటీకి సిద్దం అంటు శ్రీరాయల నాగేశ్వరరావు గారు కాలికి బలపంకట్టుకు తిరుగుతున్నారు. పాలేరు చరిత్ర ను అభివృద్ధి పేరుతో తాగునీరు-సాగునీరుభక్త రామదాసు, మిషన్ భగీరథ తో శాశ్విత పరిష్కారంచూపి , సూర్యాపేట నుండి ఖమ్మం హైవే కి నాంది పలికి విశాలమైన రహదారులతో దశదిశలా  పాలేరు చరిత్రకు నాంది పలికిన నేను పాలేరు ప్రజల గుండెల్లో నేను ఉన్నాను అని తుమ్మల భరోసా తో ఉన్నారు. నా రాజకీయ జీవితం పాలేరు ప్రజల తో మమేకమై చివరకు వారితోనే నా రాజకీయ జీవితం పెనవేసుకు పోతాను అంటున్న అభివృద్ధి ప్రధాత శ్రీ తుమ్మల. నాగేశ్వరరావు గారు నేను పాలేరునుండి పోటీచేయటం ఖాయం అని బహిరంగంగా చెపుతున్నారు. రాజకీయ కుట్రలతో కొన్ని శక్తులు నన్ను ఓడించినా ప్రజల మనస్సులో నేను ఉన్నానుఅని వారి ఆకాంక్ష మేరకు నేను తిరిగి పోటీ చేస్తాను అని అంటున్నారు. కేసీఆర్ ని బలంగా  నేను నమ్ముకొన్నాను నాకు అన్యాయం చేయరు అనే బరోసాతోనే నేను మీకు చెపుతున్నాను అని తుమ్మల నాగేశ్వరరావు ప్రతిచోటా అంటున్నారు.

allso read- షర్మిల టీమ్ కు ఏమైంది

ఇదే క్రమంలో ఎలాంటి పరిస్థితులు వచ్ఛినా  పాలేరు ప్రజల ఆకాంక్ష కు చివరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీ చేస్తాను కాని పాలేరు ప్రజలకు దూరంగా ఉండలేను అంటున్నారు. ఎందుకంటే సీతారామి ప్రాజెక్టు నాజీవిత లక్ష్యం, అది నాకల దీన్ని పూర్తి చేసి పాలేరు ప్రజల పాదాలు కడిగి నా రాజకీయ జీవితం ముంగించుకొంటా అని ఆత్మీయ సన్నిహితులతో చెపుతున్నారు. ఈ కారణంగా పాలేరులో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. బి.యస్ .పి పార్టీ రాష్ట్ర అద్యక్షుడు ప్రవీణ్ కుమార్ నూతన ఉత్తేజం తో దళితబహుజనులను ఏకంచేసి యాదవుల మద్దత్తుతో తన అదృష్టాన్ని పరిక్షించుకొనుటకు సిద్దమౌతున్న రియలెస్టేట్ విజేత హరితా డౌవలపర్ అధినేత   అలిక. వెంకటేశ్వర్లు రంగంలో దిగుతున్నారు. వీరికితోడు బిజెపి రాజకీయ అదునుతో కాచుకు కూసుంది. రాజకీయ పరిణామాలు తారుమారు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి  కాకుండా  బలమైన అభ్యర్థిని బుట్టలో వేసుకొని గెలుపు లక్ష్యంగా పావులు  కదుపుతొంది.  బిజెపి తోడు మరికొంత మంది రంగంలో ఉండే అవకాశం ఉన్నా ప్రముఖంగా ఈ ఆరు పార్టీ లు ఐదుగురు అభ్యర్థులు బలమైన నిర్ణయముతో ఉండటంతో పాలేరు పంచముఖ పోరులో నిలవబోతున్నారు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది.!  రాజకీయ అదృష్టం అనూహ్య పరిణామాలతో అందిపుచ్చుకున్న శ్రీ కందాల ఉపేందరెడ్డి గారు తన రాజకీయ భౌషత్ ను అంత తేలికగా వదులు కొనుటకు సిద్దంగా లేరు. ప్రభుత్వ ఫతకాలు వ్యక్తి గత ఆర్థిక సహాయంతో ప్రజలను నమ్ముకొన్నారు తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి మార్క్ ను చూపించలేక పోయారు. ప్రతీ కుటుంబానికి ఆర్థిక సహాయం అన్న ఏకైక ఎజెండా తో మాత్రమే ముందుకు పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి మిత్రపక్షాలు తెరపైకి వచ్ఛాయి పాలేరు సీటును ఎక్కడ కమ్యూనిస్టు లకు కేటాయిస్తారో అన్న గుబులు కందాలకు ఉన్నప్పటికీ మనమే ఎన్నికల బరిలో ఉంటాము అన్న భరోసా మాత్రం కార్యకర్తలకు ఇస్తున్నారు. కమ్యూనిస్టు లకు ఆర్థిక సహాయం అందించైనా సరే వారికి మరో సీటు తీసుకొనండి అనే సలహతో పాలేరులో నేను పదిలం అనుకొంటున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఖమ్మం పట్టణం ఆనుకొని ఉన్న పాలేరు సిపిఎం కార్యచరణ కు అనువైన ప్రాంతం. అంతేకాకుండా అనేక కమ్యూనిస్టు పోరాటాలు, సాయుద తెలంగాణ పోరాటం కమ్యూనిస్టులకు నిలయం పాలేరు. ఎన్నో విజయాలు కూడ అందుకొన్న చరిత్ర పాలేరులో సిపిఎం కు ఉంది. రైతు కూలి సంఘాలతో మమేకం అయి  బలమైన క్యాడర్ ని తమ్మినేని తయారు చేయగలిగారు. ఆ తరుణంలోనే యంపి గా ,యంయల్ గా పోటీ చేసినప్పుడు కార్యకర్తలను తయారు చేయగలరు. విద్యార్థి దశనుండి వెంకటవీరయ్య పాలేరులో  విజయం సాధించి సిపిఎం కు పునాదులు బలంగా వేసి యువతను కదిలించగలిగారు. కాని కాలానుగుణంగా వచ్ఛిన రాజకీయ మార్పులకు అనుగుణంగా గ్లోబలైజేషన్ లో  మారిన రాజకీయ పరిణామాలతో ఆర్థిక, కుల రాజకీయాలతో కమ్యూనిస్టు లు వెనక్కు నెడ్డబడ్డారు. తన ఉనికిని నిలబెట్టుకోటానికి తమ్మినేని పడరాని పాట్లు పడినాకాని ఫలితం లేకపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా కేసీఆర్ రూపంలో అందివచ్ఛిన అవకాశం తో పూర్వ వైభవం తెచ్ఛు కోవాలని కమ్యూనిస్టు కదనరంగంలోకి దూకుతున్నారు.

allso read- షర్మిళ నీ బాష మార్చుకో: తాతామధు

దీనిలో ముఖ్యంగా సిపిఎం ముందు వరసలో ఉండి పాలేరు పై సిపిఎం దృష్టి పెట్టింది. ఎందుకంటే సిపిఐ భావజాలం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అనుకూలత వలన  ఖమ్మంలో సిపిఎం కు అవకాశం లేదు. ఏకైక మార్గం పాలేరు మాత్రమే. అందునా ఖమ్మం నుండి కార్యకలాపాలకు పాలేరు మాత్రమే కేంద్ర బిందువు కాబట్టి తమ్మినేని పాలేరు పై పావులు కదుపుతొన్నారు. పాలేరులో అంతమాత్రంగా  ఉన్న సిపిఎం పార్టీ పుంజుకొని బలమైన టి ఆర్ యస్ (బి ఆర్ యస్) ఓటుబ్యాంక్ ను గంపగుత్తగా సిపిఎం కు పడతాయా అన్నది మాత్రం సందేహమనే చప్పవచ్ఛు.ఈ సహస యాత్ర లో తనదైన ముద్రతో పాలేరు లో పాగా వేయటం కొరకు తమ్మినెని శ్రమించక తప్పదు అని చెప్పవచ్చు.!

ఏపార్టీవారైనా రెడ్డి సామాజిక వర్గం తనకు తోడుగా ఉంటుందని ,వైయస్ రాజశేఖర్ రెడ్డితో కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం తో కాంగ్రెసు ఓట్లు నాకు పడతాయి అన్న బలమైన కాణంతో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత షర్మిల బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగానే పాలేరును ఎంపిక చేసుకొన్నారు అని తెలుస్తోంది. దీనికి ఉదాహరణకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఖమ్మం నుండి వైయస్సార్ కాంగ్రెసు తరుపున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ ఓటరులు రాజశేఖర్ రెడ్డి పై అభిమానులు శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించిన తీరును బలంగా నమ్ముతున్నారు. కాని ఆనాడు కాంగ్రెస్ సిపిఐ పొత్తు లో చేతిగుర్తు లేక పోవడం వైయస్సార్ కాంగ్రెసు కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కలిసి వచ్ఛిన అంశం. కానీ ఈ నాడు పాలేరులో చేతిగుర్తు తో కాంగ్రెసు పోటీ లో ఉంటుంది. ఈ పరిణామాలు ఏమేరకు అనుకూలించి విజయాన్ని అందుకొంటొందో షర్మిల వేచిచూడక తప్పదు.!రాజశేఖర్ రెడ్డి పేరుని ,రెడ్డి సామాజిక వర్గం పై బలమైన నమ్మకం తో మాత్రమే పాలేరులో పోటీకి దిగుతున్నారు అని చెప్పవచ్ఛు

ఇది ఇలా ఉంటే ఎవరు అభ్యర్థి గా వస్తారో తెలియని అయోమయంలో కాంగ్రెస్ ఉంది అని చెప్పవచ్చు. దీని తో సంబందం లేకుండా నేను సైతం మీకు అండగా ఉన్నాను అని రాయల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ కార్యకర్తలకు బరోసా ఇచ్ఛే ప్రయత్నం చేస్తున్నారు.!

allso read- ఆరుగురు సజీవదాహనం

నూతన ఉత్తేజాన్ని ఇచ్ఛే ప్రయత్నం లో బియస్ పి రాష్ట్ర అద్యక్షుడు ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ ధళిత భౌజనులను ఏకంచేసే ప్రయత్నంలో భాగంగా పాలేరులో ఏమేరకు ప్రభావితం చేయగలరో వేచిచూడాలి. దీనికి అనుగుణంగా నే అనునిత్యం ప్రజలకు దెగ్గర అయ్యేపనిలో బియస్ పి జిల్లా అద్యక్షుడు అలిక వెంకటేశ్వర్లు ప్రయత్నం చేస్తుండగా బిజెపి మాత్రం తెలంగాణ రాజకీయ గాలిలో బలమైన అభ్యర్థి కోసం వేచిచూస్తుంది.!

ఈ మొత్తం రాజకీయ క్రీడలో మిత్రపక్షాల పొత్తు ,కందాల ఉపేందరెడ్డి రాజకీయ భౌవితవ్యం ,షర్మిల రంగప్రవేశం ,ఓడినచోటే గెలిచి ప్రజల రుణం తీర్చుకోవాలన్న తుమ్మల పట్టుదల పాలేరు లో రాజకీయ ఆసక్తిని రేపుతోంది.!

వీటన్నింటి పరిణామాలు పక్కన పెడితే ఇటీవల మునుగోడు లో జరిగిన ఎన్నికల తీరు,డబ్బు ప్రభావితంతోపాటు కుల రాజకీయాలు రోతపుట్టిస్తున్నాయి.ప్రజలు ఇదే అంశంపై చర్చించుకొంటున్నారు.తాత్కాలిక ప్రయోజనం తో ప్రజలను ప్రలోభ పెట్టి ఓటును రాబట్టే తీరు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. పదిరూపాయలు పంచిపెట్టే రాజకీయలకంటే పది తరాలు గుర్తు పెట్టుకొనే అభివృద్ధి పై ప్రజలు దృష్టి పెడుతున్నారు. రాజకీయ మంటే ప్రజా సేవలో పైరవీలు, పదవులు ,డబ్బుకాదు భావిభారత పౌరులకు ముందు తరానికి బాటలు వేసే అభివృద్ధి కావలని ప్రజలు ఆకాంక్షించి ఆలోచించే రోజులు తప్పకుండా వస్తాయి. ఇదే నిజమైతే అభివృద్ధి ప్రదాత తుమ్మల ముందు వరసలో ఉంటారని చెప్పక తప్పదు.

 

లోడిగ వెంకన్నయాదావ్. సామాజిక వేత్త.పాలేరు