Telugu News

బూర్గంపాడులో పెద్దపులి భయాందోళనలో జనం.

బూర్గంపహాడ్ -విజయం న్యూస్

0

బూర్గంపాడులో పెద్దపులి భయాందోళనలో జనం.

((బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోకి పెద్దపులి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి సోంపల్లి వద్ద కిన్నెరసాని నది పరివాహక ప్రాంతంలో పులి సంచరించిన్నట్లు సమాచారం. అయితే పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించి నిర్ధారించారు. ఈ విషయం మండలంలో వ్యాపించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.