Telugu News

ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పై కరుణ చూపాలి: మంత్రి పువ్వాడ

చింతకానిలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ

0

ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పై కరుణ చూపాలి: మంత్రి పువ్వాడ

== చింతకానిలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ

(చింతకాని/ఖమ్మం-విజయంన్యూస్)

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీగా గెలిపించుకోవాలని, అందుకు ప్రజల కరుణ ఈసారి కూడా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించి రూ.80లక్షలతో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చింతకాని మండలం గాంధీ నగర్ లో రూ.20లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ శంకుస్థాపన చేశారు. పాతర్లపాడు గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

నేరడ గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వారు ప్రారంభించారు. కోదుమూరు గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కోదుమూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు..ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులు ఎప్పుడైనా చూసారా.. ఇన్ని కోట్లు ఏ ప్రభుత్వం ఇచ్చిందో చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలిచి, ప్రత్యర్ధ పార్టీలకి డిపాజిట్ కూడా రాకుండా పని చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, ప్రతి సారి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు నమోదు కాగా ఈ సారి అది సీన్ రివర్స్ కబోతాఉందని, ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: వేప విత్తనాలతో సీడ్ గణపతి ప్రతిమల పంపిణికి శ్రీకారం: మంత్రి పువ్వాడ

ప్రతి నాయకుడు, కార్యకర్త ఆత్మ విశ్వాసంతో పని చేయాలని.. అప్పుడే విజయం మనది అవుతుంది అని స్పష్టం చేశారు. కలిసి కట్టుగా పని చేసి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకుని, విజయం సాధించి అనుకున్న లక్ష్యం ను పూర్తి చేసి కేసీఅర్ కి ఖమ్మం జిల్లాను గిఫ్ట్ గా ఇవ్వలని  కోరారు. మధిర నియోజకవర్గ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. మన గ్రామాలను మనమే బాగు చేసుకునే అదృష్టం మనకు ముఖ్యమంత్రి కేసీఅర్ కల్పించారని, దాన్ని కొససాగించాలంటే మనం మన ప్రభుత్వం ను గెలిపించుకోవాలని అన్నారు.