Telugu News

ప్రజలందరు స్వీయ రక్షణ పాటించాలి

** ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలి

0

ప్రజలందరు స్వీయ రక్షణ పాటించాలి
** ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలి
** మందస్తు చర్యలు తీసుకునేందుకు అందరు సిద్దంగా ఉండాలి
** వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ నూరు శాతం పూర్తి చేయాలి
** సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులకు సూచించిన మంత్రి పువ్వాడ
** 100 శాతం పూర్తి చేసినందుకు రాష్ట్రంలో రెండవ స్థానం పట్ల అధికారులను అభినందించిన మంత్రి
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
కోవిడ్-19, ఓమిక్రాన్, డెల్టావేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా మహామ్మారి నుండి రక్షణ పొందేందుకు జిల్లాలో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలని, వ్యాక్సినేషన్ తోనే రక్షణ పొందుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమీషనర్ విష్ణు. యస్. వారియర్ తో కలిసి కోవిడ్-19 నివారణ చర్యలు, ఆక్సిజన్ నిల్వలు, బెడ్స్, ఔషధాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజురోజుకు కేసులు అధికంగా నమోదవుతున్న ధృష్ట్యా అన్ని ముందస్తు చర్యలతో సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

also read :-టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు..

వ్యాక్సినేషన్ మొదటి డోసు వందశాతం పూర్తి చేసి రెండవ స్థానంలో జిల్లాను నిలపడంలో అధికారులను అభినందించారు. రెండవ డోసును కూడా ఈ నెలాఖరులోగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని కార్పోరేటర్లు సైతం ప్రతి ఇంటిలో వ్యాక్సిన్ పొందిన వివరాలను తెలుసుకోవాలన్నారు. జిల్లాలో 10 లక్షల 60 వేల 576 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా రెండవ డోసు 9 లక్షల 13 వేల 334 మంది మాత్రమే తీసుకున్నారన్నారని, మిగతా వారు సైతం రెండ డోసు వ్యాక్సిన్‌ను తీసుకోవాలన్నారు. రెండు డోసులు పూర్తయిన వారు గడువు పూర్తయిన అనంతరం బూస్టర్ డోసును తీసుకోవాలన్నారు. పండగల సీజన్లో అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చారని వారి వల్ల కోవిడ్ వ్యాప్తి చెందడంతో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు.

వైద్య శాఖ ఆధ్వర్యంలో హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలన్నారు. ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం, ముదిగొండ మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా పర్యవేక్షించాలని, ఎర్రుపాలెం మండలానికి వ్యాక్సినేషను ప్రత్యేక అధికారిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, ముదిగొండ మండలానికి వైరా ఏ.సి.పి స్నేహా మెహరాను నియమించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖచే చేపడున్న కార్యక్రమ వివరాలను మంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల సలహాలు, సూచనల మేరకు అన్ని ముందస్తు చర్యలతో అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.

also read :-ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి: ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి

స్పెషల్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ రెండు డోసులు వందశాతం పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్న్ సురభి, అడిషనల్.సి.పి గౌస్ ఆలమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతీ, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజేష్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.