ప్రజల ఆశీర్వదమే పాదయాత్ర సక్సెస్: భట్టి
మోటర్ సైకిల్ నడిపిన భట్టి విక్రమార్క...భారీ ర్యాలీతో ఘనస్వాగతం
ప్రజల ఆశీర్వదమే పాదయాత్ర సక్సెస్: భట్టి
== ప్రజల సమస్యలు చూస్తుంటే బాధకల్గించింది
== మండుటెండల్లో ఇబ్బందులు కల్గిన ప్రజాబలమే నడిపించింది
== మధిర ప్రజలు తలదించుకునే పనిచేయను.. తలఎత్తుకుని తిరిగేలా పనిచేస్తా
== ఉమ్మడి జిల్లాలో 10కి 10 గెలడమే మనందరి లక్ష్యం
== ఎర్రుపాలెంమండల కార్యకర్తల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
== మోటర్ సైకిల్ నడిపిన భట్టి విక్రమార్క…భారీ ర్యాలీతో ఘనస్వాగతం
(ఖమ్మంప్రతినిధి/ఎర్రుపాలెం-విజయంన్యూస్)
మండుటెండల్లో ఇబ్బందులు ఏర్పడిన.. జ్వరంతో బాధపడిన ప్రజల ఆశీర్వాదం ముందుకు నడిపించిందని, ప్రజా బలమే పిపుల్స్ మార్చ్ పాదయాత్ర సక్సెస్ అవ్వడానికి కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 100 రోజుల క్రితం అదిలాబాద్ జిల్లా, పిప్రి గ్రామంలో తలపెట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర జులై 2న ఖమ్మంలో విరమించగా, గాంధీభవన్ కు వెళ్లిన భట్టి విక్రమార్క 120 రోజుల తరువాత మధిర నియోజకవర్గంలో పర్యటించారు. పాదయాత్ర అనంతరం తొలిసారిగా ఎర్రుపాలెం మండలానికి వచ్చిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మోటర్ సైకిల్ నడుపుతూ ఎర్రుపాలెంకు చేరుకున్నారు. వేలాధి మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. శాలువలతో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర ప్రజల ఆశీర్వాదం వలనే రాష్ట్రం అంతటా తిరిగ గలిగానని అన్నారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్ నోరు జాగ్రత్త: భట్టి విక్రమార్క
మీ అందరి ప్రేమ,అభిమానం నన్ను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు పాదయాత్ర చేయడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. రాష్ట్రం లో పాదయాత్ర ఎక్కడ నడుస్తున్నా మధిర గురుంచి సమస్యలు గురుంచి ఆలోచిస్తూనే ఉన్నానని, పార్టీ నాయకులతో, అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నానని అన్నారు. మధిర నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కంటే నాకు ఏది ముఖ్యం కాదని అన్నారు. మధిర ప్రజలు తలదించుకునే పని భట్టి విక్రమార్క ఎప్పుడు చేయబోడని, తల ఎత్తుకుని జీవించే పనులు మాత్రమే భట్టి విక్రమార్క చేస్తాడని అన్నారు. అందుకే పాదయాత్ర చేస్తున్నప్పటికి ప్రజలందరు పోన్లలో సమస్యలను పరిష్కరించేందుకు పనిచేశానని అన్నారు. పాదయాత్ర లో మండు ఎండల వలన ఇబ్బంది జరిగిందని, ఆరోగ్యం కూడా ఇబ్బంది కల్గించిందని అన్నారు. ఒకానోక దశలో పాదయాత్ర అపుదామని అనుకునే దశలో ప్రజలు నాకు ఇచ్చిన భరోసా, ధైర్యం నన్ను ముందుకు నడిపించిందన్నారు. నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత అధికమై జ్వరంతో ఇబ్బందిప
డుతుంటే పార్టీ ముఖ్యనాయకులు, శ్రేయాభిలాషులు హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారని, అయినప్పటికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాద బలంలో ముందుకు సాగాననని అన్నారు. మీ అందరి ఆశీర్వాదాలు నన్ను ముందుకు నడిపించాయని అన్నారు. ఎండలు మండిపోనాయి,వర్షాలు వచ్చిన, గాలికి టెంట్ లు లేచిపోయి అయినా పాదయాత్రను ఆపలేదని, ప్రజలు ముందుకు వచ్చిన నన్ను వెన్నుతట్టి నడిపించారని, అందుకే పాదయాత్ర కొనసాగించానని స్పష్టం చేశారు. నా పాదయాత్రలో ఎంతో మంది నిరుపేదలు రోడ్లపైకి వచ్చి వారి సమస్యలను చెప్పుకున్నారని, వారి సమస్యలన్నింటికి నోట్ చేసుకోవడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై భద్రాద్రి ఎమ్మెల్యే ఫిర్యాదు
రాష్ట్రం లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం బాగా చేస్తున్నాం అని గొప్పలు చెపుతుందే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువైయ్యారని అన్నారు. నాడు మనం బియ్యం తో పాటు 9 రకాల సరుకులు పంపిణీ చేశామని, నేడు బాగా చేస్తే బియ్యం మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో మనం ఎందరు అర్హులు ఉంటే అందరికీ పించన్ ఇచ్చామని, మరి ఈరోజు ఎందరు ఉన్నా ఒక్కరికే ఇస్తున్నారని పేర్కొన్నారు. పెరిగిన ఖర్చులు,బడ్జెట్ వలన ఎక్కువ పించన్ ఇవ్వడం సహజమేనని, కానీ ప్రభుత్వ వైఫల్యం వల్ల కొందరికి మాత్రమే పించన్లు ఇస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు చూసాను ప్రజలందరూ రోడ్డు మీదకు వచ్చి వారి సమస్యలు ఏకరువు పెట్టారని, వారందరూ ఒకటే మాట మీద ఉన్నారని, దొర పాలన ఇక చాలు… ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వద్దాం అని నినదించారని గుర్తు చేశారు. పాదయాత్ర ముగింపు సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరడం పార్టీకి కొంత బలం చేకూరిందన్నారు. గతం లో మన దగ్గర నుండి చిరుకోపంతో వెళ్ళిన వారు అందరూ తిరిగి వస్తున్నారని, వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మనం అందరం కలిసి ఖమ్మం జిల్లాలో 10 కి 10 స్థానాలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరు సైనికుళ్లా పనిచేయాల్సి అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యులు రాయల నాగే
శ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బాషా, రాజీవ్ గాంధీ, నర్సింహారావు, బోస్, శ్రీనివాస్, రెడ్డి తదితరులు హాజరైయ్యారు.