Telugu News

ప్రజల మనిషి నామ: పృధ్వితేజ 

అభివృద్ధి ప్రదాతకే మా ఓటు : ఓటర్లు

0

ప్రజల మనిషి నామ: పృధ్వితేజ 

❇️ అభివృద్ధి ప్రదాతకే మా ఓటు : ఓటర్లు

❇️ నామ గళం టీవీలో చూశాం..

👉 ఖమ్మం వీడియోస్ కాలనీ, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారులు నామ పృధ్వి తేజ, నామ భవ్య తేజ,  సాయిరాం ఎన్నికల ప్రచారం

(ఖమ్మం -విజయం న్యూస్)

ఎప్పుడూ ప్రజల కోసం పరితపించే నాయకుడు నామ నాగేశ్వరరావు అని, ఆయన గెలిస్తేనే ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుమారులు నామ పృద్వి తేజ, నామ భవ్య తేజ , నామ సాయిరాం పేర్కొన్నారు. నామ విజయాన్ని కాంక్షిస్తూ వారు సోమవారం ఖమ్మంలోని వీడియోస్ కాలనీ , గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి నామ గురించి వివరించి ఓట్లు అభ్యర్దించగా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఖచ్చితంగా అభివృద్ధి ప్రదాత నామకే ఓటు వేస్తామని ఓటర్లు చెప్పడం విశేషం. నామ ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ధారాళంగా మాట్లాడం టీవీ లో చూశామని, ఆయన పనితనం గురించి మాకు బాగా తెలుసని చెప్పారు. నామకే మా ఓటు వేస్తామని ఓటర్లు చెప్పడం గమనార్హం.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కూరాకుల వలరాజు , జిల్లా మైనార్టీ నాయకులు తాజుద్దీన్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.