Telugu News

ప్రజల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం: జావిద్ 

పేదల పాలన కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటున్న వాకర్స్

0

ప్రజల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం: జావిద్ 

== వాకర్స్ తో కాంగ్రెస్ మాటముచ్చట

== పేదల పాలన కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటున్న వాకర్స్

== మత ప్రచారాలపై పెద్దలు పిల్లలకు అవగాహణ కల్పించాలి

== ఖమ్మం జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావిద్

== లకారం ట్యాంక్ బండ్ పై వాకర్స్ తో ముచ్చటించిన కాంగ్రెస్ నేతల

ఖమ్మం నగరం, సెప్టెంబర్ 8(విజయంన్యూస్):

ప్రజల సంక్షేమం, ప్రజా పరిఫాలన, ప్రజల వద్దకే పాలన రావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అందుకే ప్రజలందరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావిద్ కోరారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై ఖమ్మం నగర కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ ఆధ్వర్యంలో ‘వాకర్స్ తో  కాంగ్రెస్ మాటముచ్చట’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, మహిళా కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ అహ్మద్ జహాన్ ప్రారంభించారు. వాకింగ్ చేస్తున్న ప్రజలందర్ని కలిసి మాట్లాడారు. అప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలు, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన విషయాలపై వాకర్స్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

ప్రభుత్వం రెండేళ్ల పాటు పనిచేసిందని, వరసగా మూడేళ్ల పాటు పరిపాలన చేస్తే కొంత రాజసం వచ్చే అవకాశం ఉందని, అందుకే ప్రభుత్వం మారితే బాగుంటుందని కొందరు వాకర్స్ అభిప్రాయపడ్డారు. అలాగే ప్రభుత్వ పనితీరు బాలేదని, ప్రజల సంక్షేమం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని కొంత మంది చెప్పడంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల వద్దకు పాలనను అందించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందుకే ఆ ప్రభుత్వం కేంద్ర,రాష్ట్రాల్లో అవసరమని భావిస్తున్నామని తెలిపారు. అలాగే కొందరు మహిళలు మాట్లాడుతూ గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు విఫరీతంగా పెంచేశారని, తద్వారా పూటగడవటం చాలా కష్టంగా ఉందని, పేదలకు గుదిబండగా ధరలు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు గ్రానైట్ పరిశ్రమకు చెందిన కార్మికులు వాకింగ్ చేస్తుండగా వారితో కాంగ్రెస్ నాయకులు మాట్లాడగా వారు తమ ఆవేదనను  తెలియజేశారు. గ్రానైట్ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయని, కరెంట్ బిల్లులు, స్టోన్ ధరలు, భూముల ధరలు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఇబ్బందులు ఉన్నాయని, కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. మరికొంత మంది మాట్లాడుతూ జీఎస్టీ బిల్లుల దోపిడి మరింత పెరిగిపోయిందని, పసుపు, కుంకుమ కొన్నప్పటికి జీఎస్టీ వేస్తున్నారని, ఇడ్లీకి, దువ్వెనకు కూడా జీఎస్టీ భారీగా వేసి జనాలను నిలువున మోసం చేస్తున్నారని ఆవేనద వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావిద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెట్టి, వాళ్ల కోసం ప్రజలపై పన్నుల భారం విధిస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో, అభివద్ది పేరుతో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకోవడం, దాచుకోవడం చేస్తున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామాల పేరుతో ముఖ్యమంత్రి అయిన సీఎం కేసీఆర్ ఆ మూడు మర్చిపోయి  పోట్లు, కోట్లు, సీట్లు అనే నినాదాన్ని ఎత్తుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక పాలన పోవాలంటే కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ఆ ప్రభుత్వం వస్తేనే పేద ప్రజలకు, అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉందన్నారు. ఖమ్మం నగరంలో అభివద్ది పేరుతో మమత ఆసుపత్రి చుట్టు రోడ్లు మంజూరు చేసుకుని, ఆయనే వర్క్ లు చేసుకుంటూ కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పేదప్రజలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జిగేల్ అనిపించే విధంగా లైట్లు పెడితే అభివద్ది జరిగినట్లా..? అని ప్రశ్నించారు. ప్రజలు రాబోయే రోజుల్లో పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి: అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?