Telugu News

కాంగ్రెస్ తోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం – విజయబాయి

0

కాంగ్రెస్ తోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం
– విజయబాయి

ఏన్కూరు, సెప్టెంబర్ 14(విజయం న్యూస్): కాంగ్రెస్ తోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు బానోతు విజయబాయి అన్నారు. వాడవాడకు విజయభాయ్ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని లక్షగూడెం కోదండరామపురం తండాలో ఆమె పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణలో పిపుల్స్ సర్కార్ తథ్యం

పక్కా ఇళ్ళు, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్ల తదితర సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని విజయబాయి తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను విజయబాయి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:-;తెలంగాణ తల్లి సోనియమ్మ: పొంగులేటి