‘పేట’ కాంగ్రెస్ కు నాయకుడేడి..?
== బలమైన క్యాడర్ ఉన్.. నడిపించే నాయకుడేడి..?
== రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు
== ఉత్సాహంతో కొందరు.. నిరుత్సాహంతో కొందరు
== అప్పుడే షురూ అయిన టికెట్ లొల్లి
== అయోమయంలో హస్తం నేతలు
(శివనాగిరెడ్డి, చండ్రుగొండ-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో అశ్వరావుపేట నియోజకవర్గం నేడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు నియోజకవర్గమైన అశ్వరావుపేట విభిన్న రాజకీయాలకు నిలయమైంది. ఒకప్పుడు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ నేడు బలహీన పడుతుందనే చర్చ జరుగుతుంది. కూటమికి ఓటమి ఎరగని ఈ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడే కరువయ్యారు. ఇదిలా ఉండగా (ఆలు లేదు…సులు లేదు అల్లుడు పేరు సోమలింగం) అన్నట్లు కాంగ్రెస్లో అప్పుడే టికెట్ల గోల మొదలైంది.
ఇది కూడ చదవండి: పొంగులేటి వ్యూహమేంటి..? వాట్ నెక్ట్స్..?
క్యాడర్ను కాపాడుకోవాల్సిన నాయకులు టికెట్ నాకంటే నాకంటూ ప్రచారం చేసుకుంటూ కార్యకర్తల లో చులకన అయిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. కానీ నాయకులు ఎవరికి వారే యమునా తీరు ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యాగోచరంగా మారింది. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఆ క్యాడర్ను కాపాడుకునే కరువయ్యారు.
== మొదటినుంచి కాంగ్రెస్ కి కంచుకోట
అశ్వరావుపేట నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. నాటి జలగం వెంగళరావు హాయాం నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలమైన క్యాడర్ కలిగిన పార్టీగా ఉంది. 2004లో టిడిపి హయాంలో కొనసాగుతున్న తరుణంలో కూడా జలగం వెంకట్రావును గెలిపించిన మండలంగా చరిత్ర కలిగి ఉంది. తుమ్మల నాగేశ్వరావు మంత్రిగా ఉండి ఎన్నికలలు జరిగినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంకట్రావు పట్టం కట్టారు. అనంతరం 2009లో నియోజకవర్గ పునరువిభజన ఏర్పడడంతో అశ్వరావుపేట నియోజకవర్గo ఏర్పడింది. దీంతో స్థానికుడైన రాజకీయ కుటుంబం నేపథం కలిగిన వాగేల మిత్ర సేన ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు..
అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతర్వాత జరిగిన 2014 ఎలక్షన్ లో వైసిపి అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన గెలుపుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులై. వైయస్సార్ మృతి తర్వాత వైఎస్ జగన్ వైసీపీ పార్టీని స్థాపించడంతో కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ వైసీపీకి మద్దతు తెలిపింది. దీంతో తాటి గెలుపుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ సత్తా చాటింది. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తాటి టిఆర్ఎస్ లో చేరడం, మంత్రి తుమ్మల నాగేశ్వరావు నాయకత్వం బలపడడంతో కొంత కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది. ఎంతో 2019 ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి కరువైన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ సమీకరణలో భాగంగా టిడిపి, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడడంతో టిడిపి పార్టీకి పొత్తులో భాగంగా నియోజకవర్గంలోని టిడిపి అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆయన విజయానికి కాంగ్రెస్ క్యాడర్ ప్రధాన కారణమని చెప్పాలి దీంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ తమ ప్రాధాన్యతను తమ బలాన్ని నిరూపించుకుంది. రాష్ట్రం మొత్తం ఒక విధానమైన ఫలితాలు ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో రకమైన ఫలితాలు వచ్చాయంటే అందుకు కారణం బలమైన క్యాడర్ కాంగ్రెస్ ఉండటమే.
== బలమైన క్యాడర్ ఉన్న నడిపించేది ఎవరు
అశ్వరావుపేటలో బలమైన కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ పార్టీని ముందుండి నడిపించే సరైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాస ఏర్పడిందనే చెప్పాలి. కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వారే కరువయ్యారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వేరే పార్టీలలో కి చేరే పరిస్థితి ఏర్పడింది.
== మొదలైన టికెట్ లొల్లి
అశ్వరావుపేట కాంగ్రెస్లో పెద్ద తలనొప్పి వర్గాలు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులుగా వర్గాలుగా ఏర్పడి ఎవరికి వారై యమునాతిరినట్లుగా పనిచేస్తున్నారు. నాకే టికెట్ పక్క అంటూ ఎవరికి వారు టికెట్ కోసం నానాపాట్లు పడుతున్నారు. అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో సమన్వయం చేసే కాంగ్రెస్ నాయకులు లేకపోవడంతో క్యాడర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ టికెట్ నాది అని స్థానికులు, స్థానికేతర్లు కూడా పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తుమ్మల కోసం కదిళన జనం
పార్టీని ముందు నడిపించే నాయకుడు లేని అస్తిత్వం కోల్పోతున్న కాంగ్రెస్ ఇప్పటికైనా సరే నాయకత్వాన్ని తీసుకువచ్చి పార్టీకి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నారు. పార్టీలో ఉన్నవారు టికెట్ల కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే అందరూ ఐక్యంగా ఉండి పార్టీను ముందు నడిపిస్తే మరోసారి అశ్వరావుపేట నియోజకవర్గం గెలుచుకుని కాంగ్రెస్ కంచుకోటగా అశ్వరావుపేట ను మార్చే అవకాశం ఉందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. చూద్దాం అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆలోచించే విధంగా నాయకత్వం మారుతుందా? ఆ విధంగా చర్యలు తీసుకుంటుందా? అశ్వరావుపేటలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటున్న?? వేచి చూడాలి ఏమి జరుగుతుందో..