Telugu News

తెలుగు భాషా దినోత్సవం మనందరి భాష దినోత్సవం: మంత్రి పువ్వాడ అజయ్

మాతృభాషలో అందరం మాట్లాడదమన్న పువ్వాడ

0

తెలుగు భాషా దినోత్సవం మనందరి భాష దినోత్సవం : మంత్రి పువ్వాడ అజయ్

★★ మాతృభాషలో అందరం మాట్లాడదమన్న పువ్వాడ

(ఖమ్మం-విజయంన్యూస్)

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ దినోత్సవం తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు దోహదపడుతుందన్నారు.

ఇది కూడ చదవండి: పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం

ఎన్నో యుగాలుగా ఇక్కడి ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుతున్న తెలుగుభాషా గొప్పదనాన్ని చాటేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. భాషలు మన సమృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఎంతో కృషి చేస్తాయన్నారు.

ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని; భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవటం ముదాహమని తెలిపారు. మాతృభాష దినోత్సవమంటే నిజమైన స్వాభిమాన దినోత్సవమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

ఇది కూడ చదవండి:- బిజెపి నేతలు చర్య దుర్మార్గమైనది: మంత్రి పువ్వాడ