Telugu News

పిల్ల అన్నవరం”కి అండగా ఎంపీ నామ.

- గుండె ఆపరేషన్ కి రూ. మూడు లక్షల ఎల్ఓసీ మంజూరు.

0

పిల్ల అన్నవరం”కి అండగా ఎంపీ నామ

– గుండె ఆపరేషన్ కి రూ. మూడు లక్షల ఎల్ఓసీ మంజూరు

(ఖమ్మం విజయం న్యూస్):-

ఒక పేద గుండెకి టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అండగా నిలిచారు. ఆయన ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసీ జారీ అయింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రూ. మూడు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన పిల్ల అన్నవరం అనే వ్యక్తి గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

ఈ నేపధ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గం లోని అశ్వారావుపేట మండల నాయకులు ఎంపీ నామ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన నామ ప్రత్యేక చొరవ తీసుకుని గుండె ఆపరేషన్ కు అవసరమయ్యే రూ. మూడు లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి అందేలా కృషి చేశారు. ఇందుకు సంబంధించిన ఎల్ఓసీ కాపీని నామ బాధితుడి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఎంపీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ముల్కలపల్లి ఎంపీపీ మట్లా నాగమణి, టి.ఆర్.ఎస్ నాయకులు జారె ఆదినారాయణ, చిత్తారు సింహాద్రి యాదవ్, కనకమేడల సత్యనారాయణ, లగడపాటి రమేశ్, నామ సేవా సమితి జిల్లా అధ్యక్షులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, భార్గవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

also read :- మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.