Telugu News

పేదలను ఆదుకునేందుకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ఆర్థిక సహాయం అందజేత.  

ప్రతాపగిరి శంకర్రావు కి అందజేత.

0
పేదలను ఆదుకునేందుకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ఆర్థిక సహాయం అందజేత.
** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.

 

** ప్రతాపగిరి శంకర్రావు కి అందజేత.

(మణుగూరు  విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పైలెట్ కాలనీ గాంధీ నగర్ ఏరియాకు చెందిన  ప్రతాపగిరి శంకర్ రావు (28) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6000 రూపాయల నగదును తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బాధిత కుటుంబ సభ్యులకు వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు తరపున ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు .ఇలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు .
సమాజంలోని పేదలను ఆదుకునేందుకు రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు, రాబోయే రోజులలో కూడా మరింత మంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.