Telugu News

బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి… రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా

పార్టీలో పలువురు చేరికలు

0
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి… రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా
== పార్టీలో పలువురు చేరికలు
మణుగూరు అక్టోబర్ 15 (విజయం న్యూస్):
 శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు  సమక్షంలో శనివారం నాడు గుండాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాలు ,brs పార్టీ లో చేరారు, వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  ఆహ్వానించడం జరిగిందన్నారు, పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు, దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతున్నదన్నారు, రాష్ట్రంలో పారదర్శక పాలన చేస్తూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని , దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కి అండగా ఉండాలని కోరారు, సీఎం కేసీఆర్  అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు BRS పార్టీ లో చేరుతున్నారన్నారు, రాష్ట్రంలో వివక్ష పార్టీలకు స్థానం లేదన్నారు, ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు, పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.