Telugu News

పినపాకలో కారు పోరు

నియోజకవర్గంలో రోజురోజు పడిపోతున్న పార్టీ గ్రాఫ్

0

పినపాకలో కారు పోరు
== పాయం కోసం పట్టువీడని మాజీ ఎంపీ
== రోజురోజుకు ముదురుతున్న పంచాయతీ
== రేగా ఓటమి కోసం ఎంతకైనా సిద్దమంటున్న ఎంపీ వర్గీయులు
== నియోజకవర్గంలో రోజురోజు పడిపోతున్న పార్టీ గ్రాఫ్
== అంతే దీటుగా అడుగులేస్తున్న రేగా
== మౌనంగా అదిష్టానం..
== కార్యకర్తలకు తలనొప్పిగా మారిన వర్గపోరు
(మణుగూరు-విజయంన్యూస్)
ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాజీ ఎంపీ పొంగులేటికి మధ్య వర్గపోరు పంచాయతీ రోజురోజుకు ముదురుతున్నది.. పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది… అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట వద్ద షూరు అయిన పంచాయతీ రోజురోజుకు జఠిలమవుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.. రేగా వర్సెస్ పొంగులేటి గా మారింది.. ఫలితంగా ఇరు వర్గాల నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేసుకునే పరిస్థితికి చేరింది.. కాగా ఈ పంచాయతీ కాస్త ఒకరినోకరు ఒడించుకునే వరకు వెళ్తే పరిస్థితి కనిపిస్తోంది.. రేగా ఓటమే మా లక్ష్యం అన్నట్లుగా పొంగులేటి వర్గీయులు బుసలు కొడుతుండగా, మాకు ఓటమే లేదు..మళ్లీ మాదే గెలుపు అంటూ రేగా వర్గీయులు సవాల్ కు ప్రతి సవాల్ చేసుకుంటున్నారు… అయితే సవాల్ సంగతేంటో కానీ పినపాక నియోజకవర్గంలో మాత్రం వర్గపోరు కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నచందంగా తయారైంది పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి.. ఫలితంగా రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇలాగే వర్గపోరు ఇంకా జఠిలమైతే భవిష్యత్ రాజకీయ జీవితం ప్రశ్నార్థికం అయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.. పినపాక నియోజకవర్గంలో రేగా, వర్సెస్ పొంగులేటి వర్గపోరు పై విజయం ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.

allso read-రెచ్చిపోయిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్రస్తుతం ప్రభుత్వ విఫ్ గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన రేగా కాంతారావు అనివార్యకారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించారు. దీంతో రేగా కాంతారావు జిల్లా వ్యాప్తంగా పర్యటన చేశారు. కార్యకర్తలను, నాయకులను సమయత్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆయా నియోజకవర్గంలో రేగా కాంతారావుకు వ్యతిరేక టీమ్ వర్గంగా మారింది.. ముఖ్యంగా రేగా కాంతారావు ప్రాతినిధ్యం వహిస్తున్న పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. రేగా కాంతారావు వర్సెస్ పాయం వెంకటేశ్వర్లుగా వర్గపోరు ఉండేది.. అది సాధాహరణంగానే వర్గపోరు కనిపించేది. అయితే గత కొద్ది రోజుల క్రితం పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరువుతున్న కార్యక్రమానికి రేగా కాంతారావు వర్గీయులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన పంచాయతీ కాస్త వర్గపోరుగా మారింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాయం వెంకటేశ్వర్లు కలిసి పర్యటన చేస్తున్నారు. రేగా కాంతారావు పర్యటనలో పాయం కానీ, మాజీ ఎంపీ వర్గీయులు కనిపించడం లేదు. దీంతో వర్గపోరు జఠిలమవుతుందనుకున్న తరుణంలో మరో పంచాయతీ షూరు కావడంతో రేగా వర్సెస్ పొంగులేటి గా మారింది. ఇరువురు నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు. సవాల్ చేసుకునే పరిస్థతికి చేరింది. అంతే కాకుండా రేగా కాంతారావు, ఆయన వర్గీయులు బహిరంగ ఆరోపణలు చేశారు. కాగా పొంగులేటి వర్గీయులు, పాయం వెంకటేశ్వర్లు కూడా రేగా కాంతారావుకు సవాల్ చేసిన పరిస్థితి పినపాక నియోజకవర్గంలో చోటు చేసుకుంది.  allso read – కాంగ్రెస్ కు పికె హ్యండ్
== పినపాకపై కన్నేసిన పొంగులేటి..?     
సాధాహరణంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు.. ఆయన జిల్లాలో అనేక వర్గాలు ఉన్న, నాయకులు పిలిచిన పిలకపోయిన పార్టీ కార్యక్రమాలకు హాజరువుతూ ఎప్పుడు నవ్వుతూ అందర్ని అప్యాయతగా పలకరిస్తూ ఉంటారు. కానీ నిత్యం నవ్వుతూ ఉండే పొంగులేటి పినపాక విషయంలో మాత్రం చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు పినపాక నియోజకవర్గంలో పర్యటించకుండా వెళ్లడం లేదు. వారానికో, రెండు వారాలకోకసారో పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాయం వెంకటేశ్వర్లను వెంటవేసుకుని గ్రామాల్లో పర్యటిస్తూ ఆయన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావును కాకుండా పాయం వెంకటేశ్వర్లను ఆశీర్వదించాలని అడగటం ఆశ్ఛర్యంగానే ఉంది. అయితే నియోజకవర్గంలో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో పర్యటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కార్యకర్తను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రేగా కాంతారావుకు అతి దగ్గరగా ఉండే నాయకుల ఇండ్లకు వెళ్లి పలకిరిస్తున్నట్లు కనిపిస్తోంది..
== రేగాను ఓడించమే లక్ష్యమంటా..?             allso read-  రైతులకు ధైర్యం ఇవ్వడానికే రాహుల్ సభ: భట్టి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆయనపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థతి ఉంది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గీయులు రేగా కాంతారావు సంగతేంటో చూడాలనే తపనతో ఉన్నట్లు కనిపిస్తోంది.. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ద్రువీకరిస్తున్న పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఏం జరుగుతుందో..? భవిష్యత్ లో చూపిస్తామని పొంగులేటి వర్గీయులు బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు. అలాగే పొంగులేటి కూడా నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటన చేస్తున్నారు. వాస్తవంగా పొంగులేటి పర్యటన చూస్తుంటే కసితో చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి.. ఎక్కడ చూసిన పెద్ద మొత్తంలో కార్యకర్తలు తరలిరావడం, పూలవర్షం కురిపించడం, పెద్ద కార్యక్రమంగా మార్చడం, ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటనలు చేయకుండా తనపని తాను చేసుకుంటా పోవడం, పక్కనే పాయం వెంకటేశ్వర్లను, పిడమర్తిరవిని తీసుకెళ్లడం చూస్తుంటే కచ్చితంగా రేగా కాంతారావు పై ప్రతికారం తీసుకునే పర్యటనలా కనిపిస్తున్నాయి.

అయితే రేగా ఓటమే లక్ష్యంగా పొంగులేటి పావులు కదుపుతున్నట్లుగానే కనిపిస్తోంది.. రేగా కాంతారావుకు టిక్కెట్ రాకుండా చేయడమా..? లేదంటే టిక్కెట్ వచ్చిన పాయంను తనదారిలో ఉంటూ స్వతంత్ర అభ్యర్థిగా లేదంటే వేరే పార్టీ నుంచి పోటీ చేయించి ఓడించడమా.?. అనేదే గోల్ గా పెట్టుకుని పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో పినపాక నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తల కు తలనొప్పిగా మారిందని పలువురు ఆపార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అంతే కాకుండా వర్గపోరుతో రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నట్లే కనిపిస్తోంది.. ఆ పార్టీ నాయకులు కూడా ఇది వాస్తవేమనని స్పష్టం చేస్తున్నారు. ఇద్దరు నాయకులు వర్గపోరుతో కొట్లాడుతుంటే సందులో సడేమియా లాగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర అదిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదంటా..? ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తీవ్రతరం అవుతున్న తరుణంలో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని, పార్టీ అదిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సందికుదుర్చి ఒకటి చేస్తే పార్టీ మరోసారి విజయం సాధించే అవకాశం ఉంటుందని నియోజకవర్గ ప్రజలు అబిప్రాయపడుతున్నారు. ఇలాగే ఇద్దరు నేతలు పైటింగ్ చేసుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో రేగా కాంతారావుకు పార్టీకి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఆ ఇద్దరు నేతలు కలిసి నడుస్తారా..? ఇలాగే వర్గపోరుతో ముందుకు వెళ్తారా..? వేచి చూడాల్సందే మరి..?