పినపాక సీటు ఎవరికి..?
== కేసిఆర్ నిర్ణయంతో స్థానిక ప్రజాప్రతినిధికి ఉత్కంఠ..?
== హ్యాట్రిక్ సాధ్యమా… గత చరిత్ర పునరావృతమా…?
== పొత్తులపై కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం.?
== పోత్తులు కుదిరితే పినపాక బరిలో త్రిముఖ పోటీనా…?
== పొత్తుల వల్ల కమలం వికసించేనా…?
(మణుగూరు విజయం న్యూస్);-
గత రొండు రోజుల క్రితం ప్రగతి భవన్ సాక్షిగా సీఎం కేసీఆర్ బీజేపీపై యుద్ధం చేసేందుకు ప్రణాళికలు ప్రతి పధిస్తున్నారా దీనిలో భాగంగా తమతో కలిసి రావాలని వామపక్ష నేతలకు పిలుపునిచ్చారు. వామపక్ష అగ్ర నేతలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ కు ఆహ్వానించి వారితో వరుస భేటీలు నిర్వహించారు రాష్ట్రంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమతో కలిసి రావాలని కోరారు వామపక్ష జాతీయ నేతలు ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరావుతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది కెసిఆర్ రాజకీయ ఒక తోడు వామపక్ష నేతలు బలం రానున్న ఎన్నికలపై ప్రభావాన్ని సూపర్ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఎత్తులు ఉన్నాయని పొత్తులతో రాష్ట్రంతోపాటు పినపాక నియోజకవర్గం లో రాబోయే ఎన్నికల్లో చిగురించే బోయే పొత్తులపై నియోజకవర్గం అంతటా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో అధికారం అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ తర ప్రగతిశీల శక్తులు తో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే పినపాక నియోజకవర్గం లో రాబోయే ఎన్నికలలో సీటు ఎవరికి దక్కనుం దనే ప్రశ్న సర్వత్ర వ్యక్తం మవుతుంది.సీటు ఎవరికి దక్కి ఏనేత రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారనుందనే చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో పినపాక సీటుపై కన్నేసిన ఇద్దరి నేతలకు కంటినిండా నిద్ర లేకుండా పోయింది.
ALSO READ :-రైతుల ధాన్యాగారంగా తెలంగాణ……
మరోవైపు తమ నేతల రాజకీయ భవిష్యత్ పై గంపెడాశలు పెట్టుకున్న అనుచర వర్గంలో గుబేక్ రేపుతోంది.నియోజక వర్గ రాజకీయాన్ని పరిశీలిస్తే 2009ఎన్నికలలో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చరిస్మా తో వైఎస్ఆర్ ఆశీస్సులతో టికెట్ పొంది తొలి ప్రయత్నంలోనే సీపీఐ అభ్యర్థి పాయం. వెంకటేశ్వర్లు పై రేగా. కాంతారావు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2014 మళ్ళీ కాంగ్రెస్ టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగించిన నాటి సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా పినపాక నియోజకవర్గం సీటును సిపిఐ పార్టీ కేటాయించడంతో సీట్ కోల్పోయిన రేగా కాంతారావు తటస్థంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు.2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు సిపిఐ పార్టీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయ డంకా మోగించారు. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.తిరిగి 2019 ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ సాధించిన పాయం వెంకటేశ్వర్లు తన సమీప ప్రత్యర్థి రేగా కాంతారావు పై మరోసారి బరిలో నిలిచారు. పార్టీ మారారని అపవాదుతోపాటు నియోజక వర్గ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తితో నియోజకవర్గ ప్రజలు మరోమారు రేగా కాంతారావు కు పట్టం కట్టారు. ఈ ఎన్నికలలో రాబోయే ని రాష్ట్ర సీఎం కేసీఆర్ మణుగూరు లో భారీ ప్రచార సభ నిర్వహించిన పాయం ను ఓటమినుండి గట్టెక్కించే లేకపోయారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కేరెక్కారు.
ALSO READ:-‘పాలేరు’ లో ఘనంగా ఎమ్మెల్యే కందాళ జన్మదిన వేడుకలు
ఒకవైవు నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రేగా కాంతారావు రాబోవు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు సాధించి బరిలో నిలసి విజయంతో హ్యాట్రిక్ సాధించి కార్ పార్టీని గట్టెక్కిస్తారా లేదా గత చరిత్ర పునరావృతం అవుతుందా అనే ప్రశ్న నియోజకవర్గ రాజకీయాలలో ప్రశ్నార్థకంగా మారుతుంది.స్తబ్దత గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త పొత్తులు ఉత్తేజం నింపుతోంది. బరిలో నిలసేందుకు పలువురు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుకుంటున్నారు. పొత్తు కుదిరితే జిల్లాలో వామపక్షాలకు బలమైన క్యాడర్ ను కలిగి ఉన్న పినపాక,కొత్తగూడెం సీట్లను కొరనున్నారనే ప్రచారం ఆయా పార్టీల శ్రేణులనుడి బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే నియోజక వర్గంలో 2009 నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయని రాజకీయ మేధావులు అభిప్రాయ పడుతున్నారు.కొత్త పొత్తులతో నియోజక వర్గంలో కమలం పార్టీ వికాశించేనా అనే అంశంపై చర్చ జరుగుతోది.మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే శాసన సభ ఎన్నికల లోపు ఎవరు ఏ పార్టీ నుండి గోడ దూకి మరే పార్టీ తీర్ధం పుచ్చుకొని ఏపార్టీ కండువా కప్పుకొనున్నార నే ప్రశ్నలకు 2023 ఎన్నికలు సమాధానం కానున్నాయి.