పినపాక టిఆర్ఎస్ లో ముసలం…
వరుసగా కారు దిగుతున్న నేతలు...
పినపాక టిఆర్ఎస్ లో ముసలం…
◆◆ గులాబీ పార్టీ కి కరకగూడెం జెడ్ పి టి సి గుడ్ బాయ్…
◆◆ వరుసగా కారు దిగుతున్న నేతలు…
◆◆ మసకబారుతున్న రేగా ప్రతిష్ట…
◆◆ ఆయన ఓటమే వారి ధ్యేయం….
◆◆ రంగులు మారుతున్న పినపాక రాజకీయం….
మణుగూరు, జూన్ 25(విజయం న్యూస్)
పినపాక నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య అంతర్గతంగా వర్గ విభేదాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. నాయకుల మధ్య నెలకొన్న వర్గ పోరు తో టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు రాజు కొనడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో విభేదించిన నేతలంతా కార్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతున్నారు, రేగా సొంత మండలం కరకగూడెం లో మొదలైన వర్గపోరు తో కరకగూడెం జడ్పిటిసి కొమరం కాంతారావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ తీర్థం శుక్రవారం పుచ్చుకున్నారు.
Allso read:- తాటి ఆరోపణ వాస్తవమేనా?
ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడడం తో జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతుంది, ఇప్పటికే నియోజకవర్గంలో మండలాల కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం మరోవైపు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ములుగు ఎమ్మెల్యే ధన సరి సీతక్క టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు తో మంతనాలు సాగిస్తున్నారు కార్ పార్టీలో రేగా కాంతారావు తో విభేదించిన నేతలంతా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్న కాంగ్రెస్ నాయకుల హామీతో అధికార టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సరైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రేగా కాంతారావు పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు పక్క చూపు చూస్తుండటంతో గులాబీగుటి లో అలజడి మొదలైంది నిన్న మొన్నటి వరకు స్తబ్దత గా ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికార టిఆర్ఎస్ పార్టీపై ,ఆపరేషన్ ఆకర్ష్, మొదలుపెట్టడంతో గులాబీ పార్టీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది ఆయన ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలంతా ఏకతాటిపై నిలిచి తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు, అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీ రేగా కాంతారావు ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు రాజకీయ ఉద్దండుడు గా పేరు గడించిన ఓ ముఖ్యనేత ను రంగంలోకి దించి టిఆర్ఎస్ పార్టీలోనే అసమ్మతి నాయకుల కు గాలం విసిరి హస్తం గూటికి చేర్చే బాధ్యతలను ఆయన భుజస్కంధాలపై ఉంచినట్లు తెలుస్తోంది.
Allso read:- కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటీ
గతంలో తెలుగుదేశం పార్టీలో సీతక్కతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆ నేత రేగా కాంతారావును రాజకీయంగా మట్టి క రిపించేందుకు బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, మండలాల కు చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది, నివురుగప్పిన నిప్పులా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలతో ఓ మాజీ ఎంపీ మంత్రాంగం తోడు కావడంతో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు నాయకులు కారు పార్టీ నీ వీడెంకు సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం రేగా కాంతారావు ఆధిపత్యానికి ఆయన సొంత నియోజకవర్గంలో నే చెక్ పెట్టేందుకు ఆ మాజీ ఎంపీ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయం అనే వాదనలు నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి పినపాక నియోజకవర్గ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాడు ఉద్యమ పార్టీగా నేడు అధికార పార్టీగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎన్నికల్లోను ఎమ్మెల్యేగా పట్టం కట్టిన దాఖలాలు లేవు నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి జపం జపిస్తున్నారు ఎమ్మెల్యే రేగా కాంతారావు రానున్న ఎన్నికల్లో టికెట్ సాధించిన ఆయన విజయం మీద మాత్రం నీలి నీడలు అమ్ముకున్నట్లు స్పష్టమవుతుంది, ఇది ఇలా ఉండగా ,ఆ గట్టునుంటావా లేక ఈ గట్టునుంటావా, అన్న చందంగా అధికార పార్టీలోనే జంపు జిలానీలు సమయం కోసం ఎదురుచూస్తూ గోడదుకెందుకు సిద్ధమవుతుండడంతో పినపాక రాజకీయం రంగులు మారుతుంది.
Allso read:- కరకగూడెం టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ..