Telugu News

పిండిప్రోలులో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్సీ తాతా మధు

0
పిండిప్రోలులో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
== కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్సీ తాతా మధు
== కేసీఆర్ సుపరిపాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష : తాతామధు
(తిరుమలాయపాలెం/ఖమ్మం-విజయం న్యూస్)
ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన అవకాశం మేరకే సొంత గ్రామమైన పిండిఁపోలు అభివృద్ధి అవకాశం కలిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి . ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని, రాష్ట్ర అభివృద్ధికి పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి, సొంత గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్  ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుండి చేపట్టిన అభివృద్ధి & సంక్షేమ కార్యక్రమాల గురించి గుర్తు చేస్తూ.. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సొంత గ్రామా ప్రజలను వారు కోరారు.
బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుతో ఆకర్షితులై పిండిఁపోలు గ్రామస్తులు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలు కుటుంబాలను పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్  స్వాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు సీపీఎం కిన్నెర రమేష్, బీఎస్పీ పార్టీ నాయకులు ఆయిల్ పొంగు వెంకన్న, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ నుండి కత్తుల వీరభద్రం గారు మరియు సిపిఎం, బీఎస్పీ, ఎంఎల్ పార్టీల, నుండి 18 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో తిరుమలాయపాలెం పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ చామకూరి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు పరికపెళ్లి చంద్రశేఖర్, కార్యదర్శి రేపాకుల రవి, ప్రధాన కార్యదర్శి పసలాది ముత్తయ్య, వార్డ్ మెంబర్లు పసలాది సత్యనారాయణ, శ్రీను ఇతర నాయకులు, యూత్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.