Telugu News

ఖమ్మం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: నామా

0

ఖమ్మం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: నామా

– తెలంగాణ ప్రజల హక్కులు కాపాడాలి అంటే బీ.ఆర్.యస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలి

– రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్, కేసీఆర్  పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

– ⁠ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరీ సహకారం తో గెలుస్తాం

– మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.

– ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విపలం అయింది.

– రైతులకు 25వేల నష్టపరిహారం తో పాటుగా వరి పంటకు రూ. 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

– సాగునీరు, తాగునీరు ప్రజలకు ఇవ్వకపోవడం తో పాటుగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి

– పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం.

== ఖమ్మం రూరల్ మండల బీ.ఆర్.యస్ పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో *ఎంపీ నామ నాగేశ్వరరావు*

== పాల్గొన్న రాజ్యసభ సభ్యులు *వద్దిరాజు రవిచంద్ర , ఎంఎల్సీ , జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి*

ఖమ్మం, 22 ఏప్రిల్

– తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలి అంటే బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలని అలానే కష్టకాలం లో పార్టీకి అండగా నిలబడుతానని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్ అన్నారు.

ఇది కూడా చదవండి:- ఓట్ల కోసమే కాంగ్రెస్ వాగ్దానాలు: నామా 

సోమవారం నాడు ఖమ్మం రూరల్ మండలం మండలం పల్లెగూడెం గ్రామం లోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు బీ.ఆర్.యస్ పార్టీ మండల ముఖ్య నాయకులతో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశం లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,ఎంఎల్సీ ,జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తో కలసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఎంపీలు మాట్లాడలేదని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీ.ఆర్.యస్ జెండా ఎగరడం ఖాయమ్మన్నారు. శాసనసభ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని రైతులు, ప్రజల నుండి వినిపిస్తుందని తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సాగునీరు, తాగునీరు లేక రైతాంగం తో పాటుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ ను వెంటాడి.. వేటాడుతాం: నామా

రైతులకు ఎకరాకు 25 వేలు పంట నష్టపరిహారం తో పాటుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పండిన వరి పంటకు రూ. 500/- వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బిడ్డగా ఎప్పుడు రైతు శ్రేయసు కోసం ఆలోచిస్తా అని అందులో భాగంగానే నష్టాల్లో ఉన్న రాజేశ్వరపురం షుగర్ ఫ్యాక్టరీ కొనుగులు చేసి ఆనాటి నుండి నేటి వరుకు రైతుల కోసమే నడపడం జరుగుతుందని గుర్తు చేశారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించిన తీరును వివరించాలని కోరారు, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి విప్లవాత్మక పథకాలు దేశం లోనే ఎక్కడ లేవని అలాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రం లో అమలు చేసి రైతుకు పెట్టుబడి సహాయం, పుష్కలంగా సాగునీరు, ఉచిత విద్యుత్, పంట కొనుగోలు చేసి రైతు కుటుంబాలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. తను ఎంపీ గా గెలవకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఒక్క నేషనల్ హైవే కూడా ఉండేది కాదని తరువాత కేంద్రం పై పోరాడి పలు రోడ్లను నేషనల్ హైవే లాగా మార్చడం తో పాటుగా వందల కోట్ల నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చి ఎన్నో గ్రామాల మధ్య లింక్ రోడ్లను బీటీ రోడ్లగా మార్చమని గుర్తు చేశారు అలానే రైల్వే పనులు కూడా పూర్తి చేసుకున్నమన్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన బరోసా ఇచ్చారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, జడ్పీటీసీ వరప్రసాద్, ఎంపీపీ బెల్లం ఉమా, వైస్ ఎంపీపీ దర్గయ్య, లక్ష్మణ్, పేరం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు