పాలేరు పీఠంపై గులాబీ జెండా ఎగరేస్తాం : కందాళ
== కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉంది
== ప్రజల కోసమే మనం పనిచేయాలి
== కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీగా ఉద్యమిస్తాం పాలేరు ఎమ్మెల్యే
== సమావేశంలో భావోగ్వేదానికి లోనైన ఎమ్మెల్యే
(తిరుమలాయపాలెం-విజయ న్యూస్)
పాలేరు ఫీఠంపై గులాబీ జెండా ఎగరవేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సంసిద్దం కావాలని పిలుపునిచ్చారు. మండలంలోని దమ్మాయిగూడెం గ్రామం లోని సాయి గణేష్ పంక్షన్ హల్ లో శుక్రవారం పాలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం భాషబోయిన వీరన్న అధ్యక్షతన జరిగింది. పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండిన వరిని కొనుగోలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దుయ్యబట్టారు ప్రభుత్వం కొనే వరకు నిరసిస్తూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని గులాబీ నేతలు నిర్ణయించారు. ఎదుటివారిని నొప్పించే మనస్తత్వం నాది కాదని ఎవరికి ఏ కష్టం వచ్చినా నాదే అనుకుంటా అని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి నాకు కుల మత ప్రాంతీయ విభేదాలు లేవని ఆయన అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పని చేస్తానని ఏ సమయంలో వచ్చిన కలుస్తానని తెలిపారు. నా మనస్తత్వం ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసని ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు సహకరించాలని కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అభివాదం చేశారు. పాలేరు నియోజకవర్గంలో కచ్చితంగా గులాబీ జెండాను ఎగరేస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరు సమిష్టిగా పనిచేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విషయంలో ముందుండాలని కోరారు.
ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలతో మమైకమై ఉండాలని సూచించారు. అలాగే కేంద్రప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారిగా యుద్దం చేస్తామని, కేంద్రం మెడలు వంచైన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు వివిధ విషయాలను దిశానిర్దేశం చేశారు. వడ్లు కొనుగోలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసిస్తూ రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సభా వేదికగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు సమితి కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా నాయకురాలు బేబి స్వర్ణకుమారి, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగీలాల్ తిరుమలాయపాలెం పిఎసిఎస్ చైర్మన్ చావా వేణుగోపాల్ రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా తిరుమలాయపాలెం మండల రైతు బంధు కన్వీనర్ శివరామకృష్ణ టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కేశరాజు శ్రీలత శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బెల్లం వేణు, భాషాబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య , వేముల వీరయ్య , టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.