Telugu News

షర్మిల ప్లాన్ ఏంటి..?

పాలేరులోనే పోటీ ఎందుకు..?

0

షర్మిల ప్లాన్ ఏంటీ..?

== ‘పాలేరు’కు షర్మిల.. ఎందుకు..?

== వ్యూహత్మకంగా  అడుగులేస్తూ నిర్ణయం

== సుదీర్ఘ చర్చలు అనంతరమే ప్రకటన

== ముందస్తుగానే సర్వే.. ప్రజల్లో సానుకూల స్పందన

== పాదయాత్రలోనే ప్రకటిస్తే మైలేజీ వస్తుందని అంచనా

== వైఎస్ఆర్ టీపీ శ్రేణుల్లో ఆనందోత్సవం

 వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సై అంటున్నారు.. కనువిని ఎరుగని రీతిలో మెజారిటీ తీసుకొచ్చేబాధ్యత మీదేనని షర్మిల కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. అయితే షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం పట్ల అంతర్యమేంటి..? ఎందుకు ఆమెకు పాలేరు పై కన్నుపడింది.. ఎలాంటి సమీకరణాలను ఆమె అంచనా వేసింది..? కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలేరులో షర్మిల ముందుకు వెళ్తుందా..? విజయం సాధిస్తుందా..? షర్మిల వ్యూహం ఏంటీ..? ఎందుకు పాలేరు వైపు ఆమె కన్నుపడింది..? అన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘విజయం’ ప్రతినిధి అందించే ఈ కథనం మీరందరు తప్పక చదవాల్సిందే..?

Allso read:- పాలేరు నుంచే పోటీ చేస్తా… స్పష్టం చేసిన వైఎస్ షర్మిల

కూసుమంచి, జూన్ 19(విజయంన్యూస్)

రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో ఒక్కటి పాలేరు నియోజకవర్గం. జనరల్ స్థానం కల్గిన ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఈనియోజకవర్గంలో మొత్తం 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగ్గా, అందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీపీఐ, సీపీఎం, జనశక్తి ఒక్కోక్కసారి విజయం సాధించగా, టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఉపఎన్నికల్లో విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన జనరల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది, కాంగ్రెస్ విజయం సాధించింది.  అంటే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఫలితాలు వచ్చినట్లు భావించాల్సి ఉంది. ఇలా నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తున్నప్పటికి  ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది ప్రయత్నించి విఫలమైయ్యారు. టీడీపీ పార్టీ నుంచి కెవి రత్నం, సండ్ర వెంకటవీరయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్ రావు, పీఆర్పీ నుంచి రాయల నాగేశ్వరరావులు పోటీ పడి ఓటమిచెందారు. మంత్రిగా పనిచేస్తూ ఉప ఎన్నికల్లో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓటమిచెందారు.  కాగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో పూర్తి బలంగానే ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉన్నప్పటికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గెలుస్తుంది తప్పా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించడం లేదు.

Allso read:- ఇది బీర్లు..బార్ల తెలంగాణ.. :వైఎస్ షర్మిల

ఇలాంటి కాంగ్రెస్ నియోజకవర్గంపై వైఎస్ షర్మిల పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. అనేక నియోజకవర్గాల పేర్లు వినిపించినప్పటికి పాలేరు వైపు ఆమె చూపు పడింది. ఎందుకు..? అమె ఈ నిర్ణయం తీసుకుంది..?  చూద్దాం

== పక్కా ప్లాన్ ప్రకారమే ‘పాలేరు’ ఎంపిక

ఎన్నో అంచనాలతో పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల, ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై గతేడాది నుంచి విఫరితమైన చర్చ జరుగుతోంది. ముందుగా సికింద్రాబాద్, కుక్కట్ పల్లి అని, ఆ తరువాత కోదాడ అని అనుకున్నారు.  కానీ షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అది కూడా  ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుండగానే పాలేరు నియోకవర్గంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలేంటి ఆ కారణాలు ఒక సారి చూద్దాం.

పాలేరు నుంచే షర్మిల పోటీ

1) సర్వేలో పాలేరుకు సానుకూలత : వైఎస్ షర్మిల ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై చర్చజరుగుతున్న సందర్భంలో సికింద్రాబాద్, కుక్కటపల్లి, కోదాడ, పాలేరు నియోజకవర్గాలను ఎంపిక చేసి, అక్కడ గత ఆరు నెలల క్రితం వైఎస్ షర్మిల భర్త అనిల్ ఆధ్వర్యంలో సర్వే చేయించినట్లు తెలుస్తోంది. 10 అంశాలతో సర్వే చేసిన ఆ సర్వే టీమ్ పాలేరులో షర్మిలకు సానుకూల ఫలితాలు ఉన్నాయని, అలాగే సికింద్రాబాద్ లో కొంత సానుకూలంగా ఉన్నట్లు రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ షర్మిల రెండు నియోజకవర్గాల్లో ఆరు ప్రశ్నలతో మరోసారి సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వేలో పాలేరులోనే షర్మిలకు ఎక్కువ సానుకూలత లభించిందని తెలిసింది.

2) వైఎస్ఆర్ సీపీ ఫలితాలపై అంచనా: 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పోటీ చేస్తే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలవడం జరిగింది. వైఎస్ఆర్ అభిమానుల వల్లనే ఈ ఫలితాలు వచ్చినట్లు షర్మిల అంచనా వేస్తున్నారు.

3) రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ బోల్తా పడటం : తెలంగాణ అనంతరం రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 2014లో ఒక్కసీటు, 2018లో ఒక్కసీటు రావడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఖమ్మం నుంచి గడ్డు పరిస్థితులే ఏర్పడి 100 మైనస్ ఓట్లు రావడం జరిగింది. ఇది కూడా షర్మిల అంచనా వేసినట్లు తెలుస్తోంది.

4) బహుజన ఓటింగే ప్రధాన పాయింట్ : పాలేరు నియోజకవర్గంలో 60 నుంచి70శాతం బహుజనుల ఓటింగ్ ఉంటుంది. అందులో వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేవారు, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తీసుకున్నవారు, ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నవారే  ఎక్కువ మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అది కూడా వైఎస్ఆర్ టీపీకి  ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

4) రెడ్డి సామాజిక వర్గం : పాలేరు నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గందే ప్రధాన పాత్ర ఉంది. అందర్ని కలుపుకునిపోయే మనస్తత్వం ఉన్న రెడ్డి సామాజిక వర్గానిది ఇక్కడ డామినేషన్. గతంలో పాలేరు నియోజకవర్గంలో రామసహాయం కుటుంబం, అలాగే ఇతర రెడ్డి కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని నడిపించారు. ఇప్పుడు వాళ్లే ఉన్నారు.  జనరల్ స్థానం అయిన తరువాత రాంరెడ్డి వెంకట్ రెడ్డి వరసగా రెండు సార్లు గెలవడం, ఆ తరవాత రాంరెడ్డి మరణానంతరం తుమ్మల నాగేశ్వరరావు ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికి,తిరిగి జనరల్ ఎన్నికల్లో మళ్లీ కందాళ ఉపేందర్ రెడ్డి గెలవడం జరిగింది. అంటే నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రజలు విశ్వసిస్తారని, రాబోయే ఎన్నికల్లో కూడా  వైఎస్ షర్మిల రెడ్డిని విశ్వసిస్తారని నమ్ముతున్నారు.

5) టీఆర్ఎస్ లో వర్గపోరు.. నిస్తేజంలో కాంగ్రెస్ : పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వర్గపోరుతో కుమ్ములాడుకుంటుంది.. ఒకవైపు ఎమ్మెల్య కందాళ ఉపేందర్ రెడ్డి, మరో వైపు తుమ్మల నాగేశ్వరరావు నాకంటే నాకే సీటు అంటూ రోడ్లపైకి వస్తున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు. అది వైఎస్ఆర్ టీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు సరైన సమర్థ నాయకుడు దొరకలేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నవారిలో రాయల నాగేశ్వరరావు, మాదవిరెడ్డి తిరుగుతున్నప్పటికి వారు ఇరువురు వర్గాల మాటున పార్టీని నిస్తేజంలోకి తీసుకెళ్లారు.ఇక ఇతర ఏ పార్టీ కూడా పెద్దగా బలంగా లేకపోవడం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒక వర్గం సపోర్టు చేస్తుందనే నమ్మకంతో షర్మిల పాలేరులో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

6) వైఎస్ఆర్ అభిమానమే: వైఎస్ఆర్ టీపీ పార్టీకి బలమే స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఆయన రాష్ట్ర ప్రజలందరికి అమితమైన ప్రేమకల్గిన నాయకుడు. జనం గుండెల్లో పెట్టుకున్న నాయకుడు వైఎస్ఆర్. ఆయన తనయురాలుగా పాలేరులో పోటీ చేస్తే ఆయన అభిమానులు ఆశీర్వదిస్తారని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. రాజన్న రాజ్యమే లక్ష్యంగా అంట ప్రచారం చేస్తుండటంతో కొంత ఓటింగ్ పడే అవకాశం ఉందని షర్మిల భావిస్తున్నారు. అందుకే పదేపదే వైఎస్ఆర్ పేరును ప్రచారంలో, పాదయాత్రలో తగిలిస్తున్నారు. ఇలా అనేక సమీకరణాల నేపథ్యంలో చాలా రోజుల పాటు విచారణ చేసి, దర్యాప్తు చేసి, సర్వే చేసి వాటి ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె పాలేరులో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

== పార్టీ శ్రేణుల్లో యమ జోష్

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరు  నుంచి పోటీ చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో యమజోష్ వచ్చినట్లైంది. వైఎస్ఆర్ టీపీ పార్టీ నుంచి షర్మిల పోటీ చేస్తే గెలుపు మాదే అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే షర్మిల ప్రకటనతో ఎగిరిగంతేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పాలేరుకు మా ఎమ్మెల్యే పక్కా అంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే షర్మిల పోటీ చేయడమేమో కానీ ఆమె ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే చర్చ. చూద్దాం రాబోయే రోజుల్లో షర్మిల ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో..?