Telugu News

పొంగిపోర్లుతున్న పాలేరు జలాశయం

ఖమ్మం-సూర్యపేట జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు

0

పొంగిపోర్లుతున్న పాలేరు జలాశయం 

== ఎగువ నుంచి భారీ వరద

== 26అడుగులకు పైగా నీటిమట్టం

== ఖమ్మం-సూర్యపేట జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు

== 30వేలక్యూసెక్కుల నీరు దిగువకు 

కూసుమంచి, జులై 22(విజయంన్యూస్)

పాలేరు జలాశయం అలుగు పొంగిపోర్లుతుంది.. ఏడాది తరువాత పాలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పాలేరు జలాశయంకు ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తూ ఉండటంతో జలాశయం నిండిపోయి అలుగు ఉద్రిత్తంగా పారుతోంది. 24గేట్ల నుంచి వరద నీరు దిగువకు వెళ్తున్నాయి. 23 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం కల్గిన పాలేరు జలాశయం ప్రస్తుతం 26.50 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు వెళ్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి సుమారు 3వేల క్యూసెక్కుల నీరు పాలేరు జలాశయంకు వస్తుండగా, ఉర్లుగొండ వేటి ద్వారా మరో 15వేల క్యూసెక్కుల నీరు వరద వస్తున్నట్లు తెలుస్తోంది.

allso read- లంచం అడిగితే ఊరుకునేదే లేదు: కందాళ

అలాగే నర్సింహులగూడెం వేటి నుంచి సుమారు 10,000క్యూసెక్కుల నీరు వస్తుండటంతో పాలేరు జలాశయంకు సుమారు 30వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. తద్వారా పాలేరు జలాశయం నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాలేరు అలుగు నుంచి సుమారు 30వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.

== జాతీయ రహదారిపై రాకపోకలు బంద్..?

గత కొద్ది రోజుల క్రితం 12 అడుగులకు పడిపోయిన పాలేరు జలాశయ నీటిమట్టం వారం రోజులలోనే నిండుకుండను తలపించడంతో పాటు ఉధృత్తంగా అలుగుపారుతోంది.  నాలుగు గ్రామాలను పాలేరు జలాశయం చుట్టుముట్టింది.. దక్షణాన నాయకన్ గూడెం, తూర్పున పాలేరు, ఉత్తరాన ఉర్లుగొండ, ఎర్రగడ్డతండా, తుమ్మగూడెం, పశ్చిమన అన్నారగూడెం ఊర్లను పాలేరు జలాశయం చుట్టుముట్టింది.. ఊళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక వరద పోటుకు ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 20 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృత్తంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం వరకు పెద్ద వాహనాలకే అనుమతి ఉన్నప్పటికి.. వరద మరింత పెరిగితే కచ్చితంగా రాకపోకలను నిలిపే అవకాశం లేకపోలేదు.

ఇది కూడా చదవండి : అధైర్యపడవద్దు..అదుకుంటాం: మంత్రి

== రాజుపేట-పెరికసింగారం రాకపోకలు బంద్

పాలేరు జలాశయం అలుగు ఉధృత్తంగా ప్రవహిస్తుండటంతో వేటి దిగువలో ఉన్న పెరికసింగారం-రాజుపేట వంతెన పై నుంచి ఉధృత్తంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సుమారు వంతెనపై నుంచి 5 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది.  జులై మాసంలో అలుగు పారడం  అనేది కొంత అశ్ఛర్యకరమనే చెప్పాలి. ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అలుగు పారిన చరిత్రలు ఉండగా, ప్రస్తుతం జులై నెలలో అలుగు పారడం గమనర్హం.

==  జలాశయం వద్దకు పర్యటకులు

పాలేరు జలాశయం అలుగు పారుతున్న సంగతి తెలుసుకున్నపర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చాలా సంవత్సరాలు తర్వాత ఇలా ఉధృత్తంగా అలుగు ప్రవహిస్తుండటంతో ప్రజలు పేద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. ఎదైనా అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. వంతెన వద్ద పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. కూసుమంచి సీఐ సతీస్, ఎస్ఐ నందీఫ్  ఆధ్వర్యంలో రహదారులపై వరద ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తూ రాకపోకలను నిలిపివేస్తున్నారు.