Telugu News

దానకర్ణుడు ‘కందాళ’

కూసుమంచి మండలంలో రూ.13.50లక్షలు..ఖమ్మం రూరల్ మండలంలో రూ.23.37లక్షల అర్థిక సహాయం

0

దానకర్ణుడు ‘కందాళ’

== నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాలు, మజీదుల నిర్మాణానికి అర్థిక చేయూత

== కూసుమంచి మండలంలో రూ.13.50లక్షలు సహాయం

== ఖమ్మం రూరల్ మండలంలో రూ.23.37లక్షల అర్థిక సహాయం

== కృతజ్జతలు తెలిపిన పార్టీ నాయకులు, ప్రజలు

కూసుమంచి, జూన్ 19(విజయంన్యూస్)

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దానకర్ణుడిగా మారారు. ఇప్పటికే చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీలకు అతీతంగా రూ.10వేలను అందజేస్తున్న ఎమ్మెల్యే,అవకాశం ఉన్నప్పుడల్లా నిరుపేదలకు, విద్యార్థులకు, యువకులకు చేయూతనందిస్తూ వస్తున్నారు. విదేశి చదువుల కోసం లక్షల అర్థిక సహాయం చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి, క్రికెట్ టోర్నమెంట్లకు, దేవాలయాల నిర్మాణాలకు, నిరుపేదల కోసం, పశువులు చనిపోతే ఆయన అనేక రకాలుగా అర్థిక చేయూతనందించారు. అయితే ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం ఒక్క రోజే రెండు మండలాలకు భారీగా అర్థిక సహాయం చేశారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మాణం చేస్తున్న దేవాలయాలు, మజీదులకు, డొంక రోడ్ల నిర్మాణాలకు, క్రికెట్ టోర్నమెంట్లకు తదితర వాటికి రూ.13.50లక్షలను అర్థిక చేయూతనందించారు. సుమంచి మండలం గైగోళ్ళపల్లి రామాలయం నిర్మాణాన్నికి రూ.5 లక్షలను నిర్మాణ కమిటీ వారికి, సర్పంచ్ ముల్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అందజేశారు. అలాగే

allso read- పాలేరు నుంచే పోటీ చేస్తా… స్పష్టం చేసిన వైఎస్ షర్మిల

కోక్యా తండాలో నిర్మించనున్న రామాలయానికి రూ.5, మల్లేపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి రూ.2 లక్షలను విరాళంగా అందించారు. అలాగే గన్యా తండాలో నవయువ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ చాంపియన్ లిగ్ విజేతలకు మొదటి బహుమతి కిందా రూ.50,000లను క్రికెట్ టీమ్ మేనేజ్ మెంట్ వారికి అందజేశారు. జ్మీరహిర్మన్ తండా నుంచి బూరెన్ గుట్ట తండా వరకు లింక్ రోడ్డు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యేను అడగ్గా ఆయన స్వంత డబ్బులు రూ. 1 లక్షను గ్రామస్థులకు అందించారు.

== ఖమ్మం రూరల్ కు

ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అర్థక చేయూతనందించారు.

పలు గ్రామాల ప్రజల కోరిక మేరకు దేవాలయకు,మజీద్ లకు రూ.23.37లక్షలను  విరాళాలు అందజేశారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు ఏదులాపురం ఉమ్మర్ మజీద్ నిర్మాణానికి రూ.5 లక్షలు, జలగం నగర్ మజీద్ నిర్మాణానికి రూ.3 లక్షలు, గొల్లగూడెం గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి రూ.3 లక్షలు, బారుగూడెం గ్రామంలోని శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి గుడి నిర్మాణానికి రూ. 2 లక్షలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆయా గ్రామస్తులకు అందించారు.అలాగే అరేంపుల గ్రామంలోని మసీద్ నిర్మాణానికి రూ.2 లక్షలు, మంగళగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి నిర్మాణానికి రూ.5 లక్షలు రూపాయలు, కోలాట కళాకారులకు రూ.12,000లు అందించారు. కామంచికల్ గ్రామంలో నాంచారమ్మ గుడి నిర్మాణానికి రూ.25,000లు, పడమటి తండాలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి రూ.3 లక్షల రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ ప్రజలు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అడిగిన వెంటనే కాదనకుండా అందరికి సహాయం చేస్తున్న ఎమ్మెల్యే కలకాలం ఆయురారోగ్యాలతో జీవించే విధంగా ఆ దేవదేవళ్లు ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగ కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన నా కష్టంగా భావించి సమస్యలను పరిష్కరిస్తానని హామినిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరికి ఏదో ఒక రకంగా సహాయసహాకారాలు అందిస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బెల్లం ఉమా, మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, బెల్లం వేణు, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్,నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్,  నాయకులు, సర్పంచులు తదితరులు హాజరైయ్యారు.