Telugu News

ఇంటింటికి ఎమ్మెల్యే సతీమణి..ఎందుకోసమంటే..?

నిండు వర్షంలో కూడా ఇంటింటికి వెళ్లిన విజయమ్మ

0

ఇంటింటికి ఎమ్మెల్యే సతీమణి

== నిండు వర్షంలో కూడా ఇంటింటికి వెళ్లిన విజయమ్మ

== పేదలపై మమ్మకారం వర్షంలోను సహకారం…

==  జోరు వానలోను కూడా ఆగని కందాళ చేయుత సహాయం…

== కూసుమంచి మండలంలో 68 కుటుంబాలకు రూ.10వేల చొప్పన అర్థిక సహాయం

(pendra anjaiah)

 కూసుమంచి, ఆగస్టు 2(విజయంన్యూస్)

 

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ కూసుమంచి మండలంలో ముమ్మరంగా పర్యటించారు. ఆమె సుమారు 12 గ్రామ పంచాయతీల్లో నిరుపేదల ఇండ్లకు వెళ్లి పేదలను కలిశారు..నిండు వర్షం వస్తున్న ఆమె వెనకడుగు వేయలేదు.. వర్షంలో గొడుగు సహాయంతో ఇంటింటికి తిరిగారు.  వారికి భరోసా కల్పించారు.. మేము అండగా ఉంటామని హామినిచ్చారు. వారికి అర్థిక చేయూతనందించారు.

ఇది కూడా చదవండి : ఇంటి మీద బెంగతో గూడ దూకిన విద్యార్థిని.. ఏమందంటే..?

పాలేరు ఎమ్మల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పేదలకు  అర్థిక చేయూతనందించే కార్యక్రమం కూసుమంచి మండలంలో ఘనంగా జరిగింది. కూసుమంచి మండలంలోని మొత్తం 68 కుటుంబాలకు రూ.6.80లక్షలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ పార్టీ నాయకులతో కలిసి పంపిణి చేశారు. కూసుమంచి మండలంలోని ఎర్రగడ్డ తండాలో బాణోత్ సాలి, పూరియా తండాలో బాధవత్ ఈరమ్మ, గైగోళ్ళపల్లిలో వలపరెడ్డి సూరమ్మ, చౌటపల్లి మహ్మద్ ఇసుబ్ మీయా, పోచారంలో మలిశెట్టి పెద్ద వెంకయ్య,గుడిపాటి కోటిలింగం, సీతారాంపురంలో నక్కనబోయిన లింగమ్మ, కిష్టాపురంలో కొక్కిరేణి వెంకటేశ్వర్లు, తిరుమల నాగచంద్ర రెడ్డి, చేగొమ్మలో ఒలికొండ వీరయ్య, పొలంపల్లి శ్రీకాంత్, రాచకొండ భిక్షమయ్య, మునిగేపల్లి లో చేరుకుపల్లి వెంకటమ్మ, ఆగ్రహరంలో కర్ల రంగయ్య, కోక్యా తండాలో బాణోత్ శ్రీనివాస్, గన్యా తండాలో గుగులోత్ గంగమ్మలు ఇటీవలే మరణించగా, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ వారి కుటుంబాలను పరామర్శించారు. అలాగే కూసుమంచిలోని నలగాటి ఈదయ్య, కందుకూరి యాలమంచమ్మ, అడెపు వెంకమ్మ, కొక్కిరేణి నర్సమ్మ గంగబండ తండాలో కంది సీతమ్మ, గర్వాయిగూడెం తండాలో మాలోత్ బాలు నాయక్, జుజ్జుల్ రావుపేటలో సిరికొండ సాయి, రాజుతండాలో భూక్యా హునీ, తుమ్మల తండాలో తేజావత్ ద్వాలి, గోరీళ్ళపాడు తండాలో భూక్యా సోన, చాంప్ల తండాలో తేజావత్ స్వామి, భగవాన్ తండాలో తేజావత్ పద్మ, పెరికసింగారంలో గడ్డం ఈశ్వరమ్మ, వీర్ల లక్ష్మీ, షేక్ నాగుల్ మీరా, జక్కేపల్లిలో నల్ల శీరీష, దుస్సా తులిశమ్మ, రాజుపేట బజార్ బొడ్డు ముత్తమ్మ, మంగలితండాలో గుగులోత్ పున్నమ్మ, నాయకన్ గూడెంలో కిన్నెర వీరస్వామి, ఎండీ. జరీనా బేగం, షేక్ అలీ సాబ్, రసూల్ గట్టుసింగారంలో బారి బూదెమ్మ, మల్లెపల్లిలో  చిలకల ముత్యాలమ్మ,చిట్టిపోతుల సత్యంబాబు ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని  మంగళశారం వారి స్వగృహాలకు వెళ్లి,వారి కుటుంబ సభ్యులను పలకరించి వారికి భరోసా కల్పించారు. ప్రతి కుటుంబానికి రూ. 10వేల చొప్పున ఆర్ధిక సహయాన్ని ఈ 26 కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు. కులమతాలకు అతీతంగా పాలేరు ఎమ్మెల్యే అర్థిక సహాయం అందిస్తున్నారని, ఎప్పటికి ప్రజలను మర్చిపోయే పరిస్థితి లేదన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని, మా స్వంత మండల ప్రజలను కాపాడుకునేందుకు మేము సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, జడ్పీటీసీ ఇంటూరి బేబి, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, ప్రధాన కార్యదర్శి ఆసీఫ్ పాషా, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల పరుశురామ్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు వడ్తియా బాలక్రిష్ణ, మహిళ ప్రతినిధులు అలివేలమ్మ, వాకా సుధారాణి తదితరులు హాజరైయ్యారు.