Telugu News

పాలేరు నుంచే పోటీ చేస్తా… స్పష్టం చేసిన వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ టీపీ జెండా పాలేరులో ఎగరేద్దాం.. మంత్రి పై మండిపడిన షర్మిల

0

పాలేరు నుంచే పోటీకి సై

== స్పష్టం చేసిన వైఎస్ షర్మిల

== ఇక నుండి షర్మిళక్క ఊరు ‘పాలేరు’

== పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడం నా అదృష్ట్టం

== ఈ కోరిక మీదే కాదు…నాదికూడా

== వైఎస్ఆర్ టీపీ జెండా పాలేరులో ఎగరేద్దాం

== కనివినీ ఎరుగని మెజార్టీని ప్రజలు ఇచ్చేందకు సిద్దపడాలి

== పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి లో వైయస్సార్ టిపి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వైయస్ షర్మిళ….

== మంత్రి పై మండిపడిన షర్మిల.

నేలకొండపల్లి/కూసుమంచి,జూన్ 19(విజయంన్యూస్)

వైఎస్ఆర్ బిడ్డగా పాలేరు నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమనేది నాఅదృష్టంగా భావిస్తున్నానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అది మీ కోరిక మాత్రమే కాదని, నా కోరిక కూడా ఉందని, వైయస్సార్ బిడ్డ పాలేరు నుండి పోటీ చేసేందుకు దేవుడు తథాస్తు అంటాడాని నా నమ్మకమని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల తలపెట్టిన మహాప్రజాప్రస్తానం పాదయాత్ర ఆదివారం నేలకొండపల్లి మండలంలో ప్రారంభమైంది. ఈ జిల్లాలో ఇది చివరి రోజు కావడంతో పాలేరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ

allso read- ఇది బీర్లు..బార్ల తెలంగాణ.. :వైఎస్ షర్మిల

ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజుకు చేరిందని, అందుకు సహాకరించిన ఖమ్మం జిల్లా ప్రజలకు, వైయస్సార్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నడిచింది నేనే అయినా, నడిపించింది మీరే అని తెలిపారు. పాలేరు నియోజకవర్గ నాయకులందరికీ  జేజేలంటూ నమస్కారం చేశారు. నేను పాలేరు నుండి పోటీ చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్సుమాలు అన్నారు. ఖమ్మం జిల్లా లో అంతమంది నాయకులు వైయస్సార్ ఫోటో పెట్టుకుని గెలిచారో మీకు తెలుసని, వైయస్సార్ అనే మూడక్షరాల పేరుకు వారసులం మనమే అని స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా అంటే వైయస్సార్ జిల్లా అని, ఖమ్మం జిల్లాకు గడప పాలేరు నియోజకవర్గం అని అన్నారు. ఎప్పటి నుండో వైయస్సార్ బిడ్డ పాలేరు నుండి పోటీ చేయాలని  వందలాధి మంది ప్రజలు కోరుతున్నారని అన్నారు. వారి అభిష్టమే పరమవాధిగా భావించే వైఎస్ఆర్ బిడ్డాగా పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని, ప్రజలందరు కూడా తనను ఆశీర్వదించాలని కోరారు. గెలవటం ముఖ్యం కాదు అని, ఆ గెలుపు కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ వచ్చే విధంగా ఉండాలని అన్నారు. ఇక నుంచి నాది హైదరాబాద్ కాదని, పాలేరు అని చెప్పుకుంటానని అన్నారు. నేను పాలేరు బిడ్డగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తానని సూచించారు. ప్రజలందరు ఆశీర్వదించాలని కోరారు.

allso read- కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం తథ్యం: భట్టి విక్రమార్క

== బయ్యారంలో ఎలాంటి భాగాలు మాకు లేవు :షర్మిల

నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్న, బయ్యారంలో ఎలాంటి భాగాలు లేవని, బయ్యారం గనులకు మాకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ  జిల్లా మంత్రిని తన బిడ్డల మీద ఓట్టేసి అవినీతి, అక్రమాలో భాగం లేదని చెప్పగలడా..? అనిప్రశ్నించారు. నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డలను తీసుకొని వస్తా, నీ బిడ్డలను తీసుకోని రా ప్రమాణం చేద్దాం అని అన్నారు. నీకు దమ్ముంటే నాలుగు రోజులు మాతో కలిసి పాదయాత్ర చేయాలని, మీకు దిమ్మ తిరిగి సొమ్మసిల్లి, మీ హాస్పిటల్ అంబులెన్స్ లోనే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందన్నారు.

== మంత్రి పువ్వాడ పై మండిపడిన షర్మిల

పువ్వాడ అజయ్ కుమార్ వైయస్సార్ కాలిగోటికి పనికిరాడని, ఆయన బిడ్డను, మచ్చలేని మనిషిని నాపై తప్పుడు అరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని వైఎస్ షర్మిల హెచ్చరించారు. పిచ్చి పిచ్చి గా మాట్లాడితే జనం పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతారని సంచలన ఆరోపణ చేశారు. వైయస్సార్ అభిమానులంతా ఆయన వారసులే…అడుగు ముందుకు వేశాం, ఆ అడుగు ముందుకే వెళ్ళాలని, భయపడకుండా పోరాటం చేయండి, నేను మీ చెంతనే ఉంటానని భరోసా కల్పించారు. కేసిఆర్ అనే కొండను డీ కొడ్తున్నాం… అధికారంలోకి వస్తాం…అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా కేసులు, లాఠీచార్జీలనే వాటికి అసలే భయపడోద్దని, జైళ్లు, కేసులు కొత్తేమి కాదని, కార్యకర్తలు, నాయకులు దైర్యంగా నియోజకవర్గంలో పనిచేయాలని సూచించారు. ప్రజల వద్దకు వెళ్లాలని, వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో సమయం వచ్చినప్పుడల్లా పర్యటిస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, మధిర ఇన్ చార్జ్ కెకెడి. ఖమ్మం నగర ఇన్ చార్జ్ క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.