Telugu News

అలుగుపారుతున్న పాలేరు జలాశయం

పాలేరు అలుగును పరిశీలించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ

0

అలుగుపారుతున్న పాలేరు జలాశయం

== నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద

== పాలేరు అలుగును పరిశీలించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి, జులై 22(విజయంన్యూస్)

పాలేరు జలాశయం అలుగు పారుతోంది.. ఏడాది తరువాత పాలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పాలేరు జలాశయంకు ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తూ ఉండటంతో జలాశయం నిండిపోయి అలుగుపారుతోంది. 24గేట్ల నుంచి వరద నీరు దిగువకు వెళ్తున్నాయి. 23 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం కల్గిన పాలేరు జలాశయం ప్రస్తుతం 23.50 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు వెళ్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి సుమారు 3వేల క్యూసెక్కుల నీరు పాలేరు జలాశయంకు వస్తుండగా, ఉర్లుగొండ వేటి ద్వారా మరో 3వేల క్యూసెక్కుల నీరు వరద వస్తున్నట్లు తెలుస్తోంది.

allso read- లంచం అడిగితే ఊరుకునేదే లేదు: కందాళ

అలాగే నర్సింహులగూడెం వేటి నుంచి సుమారు 1000క్యూసెక్కుల నీరు వస్తుండటంతో పాలేరు జలాశయంకు సుమారు 7వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. తద్వారా పాలేరు జలాశయం మరింతగా అలుగు పారే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పాలేరు అలుగు నుంచి సుమారు 10వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక గురువారం రోజున మంత్రి చేతుల మీదగా రెండవ జోన్ కు ఆవుట్ పాల్ రెగ్యూలటర్ వద్ద నీటిని విడుదల చేయగా సుమారు 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  గత కొద్ది రోజుల క్రితం 12 అడుగులకు పడిపోయిన పాలేరు జలాశయ నీటిమట్టం వారం రోజులలోనే నిండుకుండను తలపించడంతో పాటు అలుగు పారడం జరిగింది. అయితే జులై మాసంలో అలుగు పారడం  అనేది కొంత అశ్ఛర్యకరమనే చెప్పాలి. ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అలుగు పారిన చరిత్రలు ఉండగా, ప్రస్తుతం జులై నెలలో అలుగు పారడం గమనర్హం.

== పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

పాలేరు జలాశయం అలుగు పారుతున్న సంగతి తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శుక్రవారం రాత్రి పాలేరు జలాశయం వద్దకు వెళ్లి  అలుగుపారుతున్న పరిస్థితిని పరిశీలించారు. వాటర్ ఆవుట్ ప్లో, ఇన్ ప్లో గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్ ప్లో ఇంకా ఎంత ఉం దని, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైయ్యారు.

allso read- పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి పువ్వాడ