Telugu News

కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం: రాయల

రచ్చబండ కార్యక్రమంలో రాయల నాగేశ్వరావు

0
కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం”
★★ రచ్చబండ కార్యక్రమంలో రాయల నాగేశ్వరావు
తిరుమలాయపాలెం,విజయం న్యూస్ 
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరావు అన్నారు మంగళవారం టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు మేరకు తిరుమలాయపాలెం తిప్పారెడ్డి గూడెం గ్రామంలో రచ్చబండ సభలను నిర్వహించరు తోళిత గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం పార్టీ జెండా ని ఆవిష్కరించి కాంగ్రెస్ జిల్లా నాయకులు మందడి ఇజ్రాయిల్  అధ్యక్షతన జరిగిన రచ్చబండ  సభల్లో రాయల నాగేశ్వరావు మాట్లాడుతూ
ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసుకుంటుంటే చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేయడం ద్వారా తెలంగాణ ఏర్పడితే సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినా కెసిఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూస్తాడని కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ  రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు 15000 రూపాయలు భూమిలేని కౌలు రైతులకు  ఏడాదికి పన్నెండు వేలు రూపాయలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు రైతులను వేధిస్తున్న ధరణి మార్పులు చేసి రైతులకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థను రూపొందిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరితమైన మాటలు చెబుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి దక్కిందన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందన్నారు 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ డిక్లరేషన్   పై పార్టీ శ్రేణులు రైతులు అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని కోరారు బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రచ్చబండ కార్యక్రమన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతన్నలకు పూర్వ వైభవం తీసుకు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మందడి ఇజ్రాయిల్,మండల నాయకులు ఉన్నం రాజశేఖర్, మాజీ సర్పంచ్ సంగు లక్ష్మయ్య, పోట్ల కిరణ్, సాగర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు మోహన్, ఎస్ కె కర్రీం, చిట్టి నూజు బ్రహ్మయ్య, ఎల్పుల  శ్రీను,ఎల్పుల చిరంజీవి, అజ్మీర బాలాజీ, మల్లీడి నారయ్య, పిడమర్తి రాజేష్, వేల్పుల వెంకటేష్, భూక్య దేశ్య,సి.హెచ్ శంకర్,బోడ శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.