Telugu News

‘పాలేరు’ నుంచి పోటీకి రె‘ఢీ’

దూకుడు పెంచిన తుమ్మల

0

‘పాలేరు’ నుంచి పోటీకి రె‘ఢీ’
== దూకుడు పెంచిన తుమ్మల
== నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన
== పోటి తథ్యమంటూ ఆసక్తికర వ్యాఖ్య
== అండగా ఉండాలంటూ ప్రచారం
== నియోజకవర్గంలో రసవత్తరంగా మారుతున్న టీఆర్ఎస్ రాజకీయం
తుమ్మల నాగేశ్వరరావు పోటీలో నిలిస్తున్నారా..? ఓడిన చోటే గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారా..? గతంలో ఉన్న ఆరోపణలను కొట్టిపారేసే పనిలో పడ్డారా..? ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? నియోజకవర్గంలోని అన్నిగ్రామాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాఫ్ సిద్దమైందా..? టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారా..? మరే పార్టీ నుంచైనా పోటీ చేస్తున్నారా..? అభిమానులకు, వర్గీయులకు ఏం చెబుతున్నారు..? పార్టీ ఏమో కానీ పోటీ చేయడం ఖాయమంటూ అభిమానులకు ఇంటూ ఇస్తున్నారా..? అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? పోటీలో పార్టీ తరుపున నిలిచేదేవ్వరు..? గెలిచేదేవ్వరు..? ‘విజయం’ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం

(కూసుమంచి-విజయంన్యూస్)
ఎక్కడ ఓడామో..? అక్కడే గెలవాలనేది పెద్దలమాట.. ఓటమికి కుంగిపోడు.. గెలుపుకు ఎగిరిపడడు.. ప్రతి సారి విజయం సాధించాలనే లక్ష్యంతో పోరాటం చేసేవాడే ప్రజల్లో నిలుస్తారనే పెద్దల మాటను నిజం చేసే పనిలో పడ్డారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అభివద్ధి ప్రధాతగా పేరొందిన మాజీ మంత్రి అనూహ్యంగా ఓటమి చవిచూసిన అనంతరం ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో అడుగులేస్తున్నారు.. ఎన్నికల అనంతరం రెండేళ్ల పాటు నిశబ్ధంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా దూకుడు పెంచారు.. కచ్చితంగా పోటీ చేయడం ఖాయమంటూ అభిమానులకు, నేతలకు సూటిగా సమాధానమిస్తున్నారు.. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ప్రజలను కోరుతున్నారు.. దీంతో పాలేరు నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నేలకొంది.. ఇప్పటికే ఎమ్మెల్యేగా విస్తతంగా పర్యటిస్తున్న కందాళ ఉపేందర్ రెడ్డి తనకే టిక్కెట్ ఖాయమంటూ ప్రచారం చేసుకుంటుండుగా..? మరో వైపు తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో పర్యటిస్తూ తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేయడం పట్ల అసక్తిగా మారింది. అసలు పాలేరు టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి వస్తుంది..? ఎవరు బరిలో నిలుస్తారు..? పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవోచ్చు:- ప్రధాని మోదీ వ్యాఖ్యలుపై మంత్రి పువ్వాడ ఫైర్..

రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో ఒక్కటి పాలేరు నియోజకవర్గం.. జనరల్ స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. రెండు సార్లు మినహా అన్ని దాదాపు 80శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పీఠంపై జెండా ఎగరవేసింది. 1962లో ఖమ్మం నియోజకవర్గం నుంచి వీడిపోయిన పాలేరు నియోజకవర్గం ఇప్పటి వరకు 14సార్లు సాధాహరణ ఎన్నికలు జరిగాయి. అందులో 12 సార్లు అసలు ఎన్నికలు జరగ్గా, రెండు సార్లు ఉప ఎన్నిక జరిగింది. 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 11సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కోక్కసారి విజయం సాధించాయి. అప్పటి వరకు వరసగా రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో మొదటి సారిగా గులాబీ జెండా ఎగరేసింది. ఆ పార్టీ తరుపున తుమ్మల నాగేశ్వరరావు 50వేల ఓట్ల మేజారిటితో విజయం సాధించారు. అప్పటికే మంత్రిగా ఉన్న ఆయన శాసనమండలిలో సభ్యుడిగా ఉంటూనే పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయగా, అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2018లో జరిగిన జనరల్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి మొదటి సారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి బరిలో నిలవగా,ఆయన పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 5వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి సంచలనంగా మారింది. సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు ఓటమిపై చాలా బాధపడ్డారు. టీఆర్ఎస్ నాయకులే ఓడించారని మదనపడ్డారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు కూడా కంఠతడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజకీయ పెనుమార్పులలో భాగంగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. దీంతో అసలైన రాజకీయాలకు మళ్లీ తెరలేపినట్లైంది. పార్టీ అధిష్టానం స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాథాన్యత కల్పించడం, ఓటమిచెందిన ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అసలే పట్టించుకోకపోవడంతో ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉండిపోయారు. ఆ తరువాత ఏమనుకున్నారో..? ఏమో కానీ..?
== పోటీకి సై అంటున్న తుమ్మల..
పాలేరు నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు తిరిగి మరోసారి బరిలో నిలవాలని నిశ్ఛయించుకున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. గత కొద్ది నెలల వరకు పరామర్శలకే పరిమితమైన మాజీ మంత్రి, ఎక్కడ కూడా పార్టీ పై కానీ, పోటీ చేసే విషయంపై కానీ ఎక్కడ స్పందించలేదు. కానీ గత పది రోజులుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో విస్త్రత్తంగా పర్యటిస్తున్నారు. ప్రతి మండలంలో నాయకులను, కార్యకర్తలను కలుస్తున్నారు.

ఇది కూడా చదవండి :- **గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించిన టి.ఎస్.ఆర్టీసీ. 

వారితో మాట్లాడుతున్నారు. పరామర్శల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవదంపతులను ఆశీర్వదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి మాట్లాడుతూ పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని, ప్రజలందరు ఆశీర్వదించాలని కోరుతున్నారు. రాజకీయాల కోసం నేను పనిచేయలేదని, పాలేరు నియోజకవర్గ అభివద్దే లక్ష్యంగా పనిచేశానని, పార్టీలకు అతీతంగా పనులు కల్పించానని చెబుతున్నారు. రాజకీయాలు చేయాలంటే ఇప్పుడున్నవారు ఎక్కడో ఉండేవారని, కానీ గ్రామాలాభివధ్దే లక్ష్యంగా పనిచేయడం వల్లనే ప్రజల గుండెల్లో నిలిచిపోయానని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేస్తా అని మాత్రం ఎక్కడ చెప్పలేదు.. పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.
== నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న తుమ్మల యుగేందర్
ఒకవైపు తండ్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో విస్తత్తంగా పర్యటిస్తుండగా, మరో వైపు ఆయన తనయుడు తుమ్మల యుగేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలను, నాయకులను కలుస్తున్నారు. ప్రజల ఇండ్లకు వెళ్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు.. ఆశీర్వదించాలని కోరుతున్నారు. దీంతో తుమ్మల వర్గీయుల్లో నూతన ఉత్తేజం నెలకొంది.

ఇది కూడా చదవండి :- కారు అదుపుతప్పి ఇద్దరు దుర్మరణం..*
== పోటీ చేయడమేంటీ..?
గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే 2023లో జరిగే ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసేదేవ్వరు..? అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వందల ప్రశ్నలుగా మారిపోయాయి.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన తుమ్మలకు అవకాశం ఇస్తారా..? లేదంటే సిట్టింగ్ గా ఉన్న కందాళ ఉపేందర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారా..? అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కచ్చితంగా పోటీ చేసేది చేసేదే అంటూ ఆయన వర్గీయులకు కితాబిస్తున్నారు.. కానీ పార్టీ విషయంలో ఆయన స్పష్టతనివ్వడం లేదు. కానీ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాత్రం టిక్కెట్ నాకే వస్తుందని ధీమా ఉన్నారు. నాకు ముందుగాను అదిష్టానం మాటిచ్చింది.. కచ్చితంగా నాకే టిక్కెట్ వస్తుందని కందాళ ఆయన వర్గీయులకు భరోసానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అవుతుందేమో అనుకుంటే.. పరిస్థితులు చూస్తుంటే తుమ్మల వర్సెస్ కందాళ గా మారే అవకాశం కనిపిస్తోంది.. అయితే వీరిద్దరి పర్యటన టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో భయాందోళన రేపుతోందనే చెప్పాలి.. తుమ్మల నాగేశ్వరావు అభివద్ధి మంత్రంతో జనాల్లోకి వెళ్తుండగా, కందాళ ఉపేందర్ రెడ్డి మాత్రం అప్యాయత, అనురాగం, అర్థిక సహాయం పేరుతో ముందుకు వెళ్తున్నారు.. అయితే ఇద్దరిలో టిక్కెట్ ఎవరికి వస్తుందనే విషయంపై స్పష్టత కరువైంది.. చూద్దాం.. రాబోయే రోజుల్లో అధికార టీఆర్ఎస్ లో ఏం జరగబోతుందో..?