Telugu News

పోడు పట్టాలు..12 శాతం రిజర్వేషన్లేవి సీఎం కేసీఆర్ : బండి సంజయ్

== బిజెపి ఎస్టీమోర్చా సమావేశంలో మండిపడ్డ బండి

0

పోడు పట్టాలు..12 శాతం రిజర్వేషన్లేవి సీఎం కేసీఆర్ : బండి సంజయ్
== బిజెపి ఎస్టీమోర్చా సమావేశంలో మండిపడ్డ బండి
(హైదరాబాద్‌-విజయంన్యూస్)
పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పారు, గిరిజనలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానన్నారు.. కానీ ఏ ఒక్క హామిని నిరవేర్చని సీఎం కేసీఆర్, నీ హామిల సంగతేంటో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో బీజేపీ ఎస్టీ మోర్చా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశం జరగగా… బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్టీల భూ సమస్యలపై పోరాడినందుకు నల్లగొండ జిల్లా గుర్రంపొడులో ఎస్టీ మోర్చా నేతలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేసిందని గుర్తు చేశారు. బిజెపితోనే గిరిజనులకు మేలు జరుగుతుందిన, బిజెపి అధికారంలోకి వస్తేనే అది సాధ్యమని అన్నారు.

also read :-హోస్టుగా మారబోతున్న వెంకటేశ్‌ ..?

రానున్న ఎన్నికల్లో 12ఎస్టీ నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ 12 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడిర చారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో భాజపా విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావే శంలో చర్చించారు. ఎన్నికల నాడే సీఎం కేసీఆర్‌కు పోడు భూముల సమస్యలు గుర్తుకు వస్తాయన్నారు.

also read :-సుకుమార్‌తో ధనుష్‌ సినిమా..?

నాగార్జునసాగర్‌ ఎన్నికలు, హుజూర్‌నగర్‌ ఎన్నికలప్పుడు.. పట్టాలిస్తానని చెప్పారు. 12శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇంకా ఇవ్వలేదు. పోడుభూములకు పట్టాలు ఇస్తానని చెప్పి సీఎం విస్మరించారని అన్నారు. ముఖ్యమంత్రికి ఓ విధివిధానం లేదు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయని బండి సంజయ్‌ పునరుద్ఘాటించారు. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, మాజీమంత్రి రవీంద్రనాయక్‌, చాడ సురేష్‌ రెడ్డి, హుస్సేన్‌ నాయక్‌, ఎస్టీ నియోజకవర్గాల ఇంఛార్జీలు పాల్గొన్నారు.