*పోడు సమస్య ప్రభుత్వానికి తలపోటుగా మారనున్నదా?*
*తాటి ఆరోపణ వాస్తవమేనా?
*దొర నైతిక విలువతో మాటనిలబెట్టుకొంటారా?
*తాటి ఆక్షేపణపై కిమ్మనని అధికార ఆధివాసి నాయకులు
అశ్వారావుపేట జూన్ 24 (విజయం న్యూస్)
అనాదిగా పట్టిపీడిస్తున్న గిరిజన పోడుపట్టాల జారీని | ఆమోదిస్తామని.., టిఆర్ఎస్
అగ్రజులు తనకు ” మాట • ఇవ్వబట్టే వైఎస్ఆర్ సిపిని వదిలి టిఆర్ఎస్లో చేరానని తాటి వెంకటేశ్వర్లు పాత్రికేయ సమావేశంలో అన్నారు.అంతేగాకుండా అగ్రనాయకుడు కెసిఆర్ మాటతప్పారని.., ఇకముందు ఆ మాటమీద నిలబడతారనే నమ్మకం కూడా పోయిందని కూడా ఆయన పేర్కొనడాన్ని గమనించాము.. ఈ తాజా పర్యవసానంతో తాటికి గిరిజనుల్లో ఎంత గ్రాఫ్ పెరిగిందో,లేదో గానీ.., ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేయబోతున్నారో.., వెల్లడించాల్సిన నైతిక బాధ్యత మీద పడింది.
Allso read:- కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటీ
ఖమ్మం నుండి అదిలాబాదు జిల్లా వరకు విస్తరించి ఉన్న పోడు సమస్య ఇప్పుడు టి.అర్.ఎస్ పాలిట తల పోటు గా మారిందనడం సందేహం లేదు. వివరాల లోకి వెళ్లితే కొన్నేళ్లుగా వేధిస్తున్న పోడు భూములకు పట్టాలు సమస్య పలు ఉద్యమాలు,విన్నపాలు,విజ్ఞప్తి లు అనంతరం ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వై.యస్.రాజశేఖరరెడ్డి హయం లొ పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత కాంగ్రెస్ పతనం,తెలంగాణ ఉద్యమం ఊపు అందుకొన్న సమయంలో టి.అర్.ఎస్ నాయకుడు కె.సి.అర్ ఈ సమస్య పరిష్కారానికి తాను అధికారం లోకి రాగానే కుర్చీ వేసుకొని సమస్యను పరిష్కరిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం జరిగింది.అధికారం లోకి వచ్చిన తర్వాత షరా మామూలుగానే ఈ సమస్యను ప్రక్కన పెట్టటం జరిగింది.ఇదిలాఉండగా హరిత హరం,అటవీ విస్తీర్ణం పెంచాలనే లక్ష్యం తో అటవీ శాఖాధికారులకు టార్గెట్లు,మరియు అధికారులు ఇవ్వడంతో అసలు సమస్య మొదలు అయ్యింది.
అటవీ అధికారులు అటవీ విస్తీర్ణం పెంచాలనే లక్ష్యంతో ఏండ్ల తరబడి పోడు సాగు చేస్తున్న భూములలొ అటవీ మొక్కలు నాటటం,పోడు వ్యవసాయం చేయనీయకపోవడం ,అక్రమ కేసులు బనాయించడంతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో ఘర్షణలు మొదలు అయ్యాయి. వామపక్ష పార్టీలు ఈ సమస్యను ఉద్యమ రూపం లొకి తీసుకొని వెళ్లారు.పాదయాత్రలు,ధర్నాలు,ర్యాలీలు తో రాష్ట్రంలో ఉద్యమం ఊపందుకొంది.చివరగా అఖిలపక్షం అధ్వర్యంలో భోర్డర్ రహదారులు దిగ్బంధంతో ప్రభుత్వం దిగివచ్చింది.సమస్యను పరిష్కరించడానికి రెవెన్యూ స్దాయి నుండి రాష్ట్ర స్దాయి వరకు కమిటీలు,అవగాహన సదస్సులు, దరఖాస్తు స్వీకరణ చేపట్టారు.పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు
*ప్రస్తుత పరిస్తితి*
పోడు సమస్య విషయంలో సాగుదారులను ఊరించిన ప్రభుత్వం మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదు. సమస్య పరిష్కారం విషయంలో సర్కారు చూపిన చౌరవ దరఖాస్తుల స్వీకరణకే పరిమిత మైనది.పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఇచ్చిన హామీ ఎప్పుడు సరవేరుతుందా? అని ఆ రైతులు ఎదురుచూస్తూనే..
Allso read:- నల్లా నీళ్ళల్లో మాంసపు ముద్దలు
ఉన్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో మార్పులేకపోవడం అటవీ అధికారులు, పొడు సాగుదారుల మధ్య పరస్పర దాడులు నిత్యకృత్యంగా మారడంతో ఎక్కడ చేసిన గొంగడి అక్కడే అన్నట్లుగానే పరిస్థితి ఉంది.
పోడు భూముల సాగు పరంగా అర్హులను గుర్తించి వారికి హక్కు పత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది.ఈ మేరుకు 21: నవంబరు మంచి డిసెంబరు 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించాలని , నవంబరు 5 2021న సీఎస్ సోమేశ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్ట ర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నిర్దేశించిన తేదీల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అయితే ఈ గడువును చెప్పాపెట్టకుండా నవంబరు 10కు కుదించారు దీనిపై గిరిజనులు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు రావడంతో ఆర్జీల స్వీకరణకు మళ్లీ కొన్ని రోజులు అవకాశం ఇచ్చి ప్రక్రియ ముగించారు. ఆ తర్వాత స్వీకరించిన అర్జీలను అధికారులు
ఆన్లైనలో నమోదు చేయడం ప్రారంభించారు..
*అంచనాలకు మించిన దరఖాస్తులు.*
‘రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఎకరాల పంపిణీకిధరఖాస్తులు రావచ్చునని అధికారులు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తు. 20 లక్షల ఎకరాలకు మించి దరఖాస్తులు రావడంతో అధి కారులు తలపట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా పేరు..పోడుఎకరాలు దరఖాస్తులు
ఖమ్మం 42560. 18603
కొత్తగూడెం 312814…88484
అసిఫాబాద్ 18710….31311
కామారెడ్డి 68505….27075
భూపాలపల్లి.73841…25021
రంగారెడ్డి 2647…..1677
పెద్దపల్లి 8298…..4614
యాదాద్రి 3948…..1457
నారాయణపేట 358…322
జగిత్యాల. 3013…..1342
ఆదిలాబాదు 62266…16661
ములుగు 77613…28680
మంచిర్యాల 33418…11774
గద్వాల. 33.25. 9
వనపర్తి 2365. 3021
మహబూబ్‌నగర్ 7158 .3974
హనుమకొండ 1454…..777
నిజామాబాదు34235..14050
వరంగల్ 21799..7389
సిద్దిపేట. 211…..149
సిరిసిల్లా 14031…5940
నల్గొండ. 44800..16998
వికారాబాద్ 20334. 8285
మెదక్ 4865…….4500
నిర్మల్ 45814…..14763
సంగారెడ్డి 7109…….3924
నాగల్కర్నూల్ 35184.10331
*నిభంధన ఏంటి?*
నిభందనల ప్రకారం 2005 డిసెంబరు 13 ముందుగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు,1975 ముందు నుండి వ్యవసాయం చేస్తున్న గిరజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వ వచ్చునని ఆర్.ఎఫ్ చట్టం2006 తెలియ చేస్తుంది.దీని ప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వం 96679 మందికి 306814 ఎకరాలు పట్డాలు ఇచ్చారు.ప్రస్తుతం 199,854 మంది733629 లక్షల ఎకరాలు పోడు వ్యవసాయం చేస్తున్నట్లు
అటవీశాఖ అంచనా వేస్తోంది. ఇందులో అనర్హలులు 65 శాతంకు పైగా ఉన్నట్లు శాఖ అధికారులు భావిస్తున్నారు.ఇక్కడే పోడు సాగుదారులకు ,అధికారులకు మధ్య పొసగడం లేదు. పట్టాలిస్తున్నారనే నెపంతో 2011 తర్వాత కూడ పోడు నరికారని సుమారుగా అయిదు నుండి ఆరు లక్షల ఎకరాలు అక్రమమని ఫారెస్ట్ అధికారులు వాదిస్తున్నారు.ఇదిలా ఉండగా చాలా చోట్ల ఫారెస్ట్, రెవెన్యూల
సరిహద్దు తగాదాలున్నాయి.వీటిని పరిష్కరించుకొనే ప్రయత్నం ఇరు డిపార్ట్మెంట్లు మధ్య సమన్వయం లేదు.అదేవిధంగా నిభందనలొ సూచించినట్లుగా 2006 ముందున్న ఫారెస్ట్ సంభందించిన సమాచారం అధికారుల వద్ద లేదు.ఆధారాలు లేకుండా అటవీశాఖ ఆరోపణ చేస్తుందని సాగుదారుల ఆరోపణ,దీనికి ఆధారాలు అటవీ శాఖ చూపించడం లేదు.సమస్య పరిష్కార విషయంలో సర్కారు చూపిన చొరవ దరఖాస్తులు స్వీకరణకే పరిమితం అయ్యిందని విమర్శలు వినిపిస్తున్నాయి.దరఖాస్తులు స్వీకరించిన తొందరగా సమస్యను ప్రక్కన పెట్టారని,కనీస సమాచారం ఇవ్వకపోవడం ప్రభుత్వం భాద్యతారహితంగా ప్రవర్తిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి
*పరిష్కారానికి నో చాన్స్*
ఆర్జీలు భారీస్థాయిలో రావడంతో వాటిని పరిష్కరించాలన్న.అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినట్లు ఎంపిక ప్రక్రియ తాత్కాలిక ంగా నిలిచిపోయినట్ల అధికార వర్గాల సమాచారం ప్రకారం.
దరఖాస్తులలోని సమాచారాన్ని నోడల్ ఏజెన్సీగా వ్యవ హరిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది ఆన్లైన్లో నిక్షిప్తం చేసారు.. క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలన్ని ఆమోదం : తెలిపితేనే ఏ దరఖాసు అయినా పరిష్కారానికి నోచు కుంటుంది. అయితే అయాకమిటీల విధి విధానా లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడ లేదు. దీనికి తోడు పోడు భూముల సమస్యకు పట్టాలిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతులొ ఉండటం వలన ప్రభుత్వం కూడ ఏమి మాట్లాడటం లేదు.దీంతో ఈ సమస్యకు పరిష్కారానికి ఇప్పుడప్పుడే అవకాశం కనపడటం లేదు.
*ఫారెస్ట్ అధికారులు దుందుడుకు*..
సమస్యా పరిష్కారానికి ఇబ్బందులున్న సమయంలో సమన్వయంగా ప్రవర్తించవలిసిన అటవీ శాఖాధికారులు ,జెసిభిలు తీసుకొనివెళ్లి ట్రెంచ్లు తీయడం,గిరిజనుల తోటలను ధ్వంసం చేయడం,అడ్డుకొన్న గిరిజనులపై కేసులు బనాయించడం నిత్యక్రుత్యంగా మారింది.రాష్ట్రంలో ఏదోక మూల ఈ పరిస్థితి కనపడుతుంది.వామపక్షాలు కూడ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ సందర్బంలో ఆధివాసి నాయకుడు తాటి ఈ విషయం పై గళం ఎత్తడం,అగ్రనాయకుడు మాట నిలబెట్టుకోలేడని వ్యాఖ్యానించడంతో ఒక్క సారిగా ప్రభుత్వం పై తన నైతికతను నిరూపించుకొమే ఒత్తిడి ఏర్పడింది. ముందుముందు ఏం జరుగుతుందో చూద్దాం.