Telugu News

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన కవిత.

హాజరైన మంత్రి ప్రశాంతరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి, ఎమ్మెల్యేలు.

0

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన కవిత.
 హాజరైన మంత్రి ప్రశాంతరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి, ఎమ్మెల్యేలు.

(నిజామాబాద్-విజయంన్యూస్) :- 
నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీకి టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నామినేషన్ వేశారు. మొన్నటి వరకు ఆ స్థానానికి ఆకుల లలిత పేరు వినిపించినప్పటికి చివరిగా టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవిత పేరును ఖారారు చేసింది. ఈ మేరకు ఆమె మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఆమెతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తున్న అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం కల్పించేందుకు ఎమ్మెల్సీ టిక్కెట్ కు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు, అందుకు సహాకరించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు నా ప్రత్యేక ధన్యవాదాలంటూ, కచ్చితంగా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్దే టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపిస్తుందన్నారు. నిన్ననే ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుందని, రాబోయే 12 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు.

also read :- ప్రభుత్వ ఉద్యోగాల పేరిట లక్షల వసూళ్లు.