Telugu News

మహబూబబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

మహబూబాబాద్- విజయం న్యూస్

0

మహబూబబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

(మహబూబాబాద్- విజయం న్యూస్);-

ఫోటోలో కనబడే వ్యక్తి దొంగ గా పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి పేరు ఏసుబ్ అలియాస్ సురేష్. ఇతడు తాళాలు లేకుండా ఉన్న ఇళ్ళలోనే దొంగతనం చేస్తుంటాడు. మహబూబబాద్ జిల్లా లో మూడు చోట్ల దొంగతనానికీ పాల్పడ్డాడు. ఇటీవల గూడూరు లోనీ ఓ ఇంట్లో నాలుగు లక్షల చోరీ లో కూడ ప్రధాన నిందితుడు. మధిర, జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతడి పై పలు కేసులు నమోదయ్యాయి. ఇతడు మహబూబాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో సంచరిస్తున్నాడు అనే సమాచారం వుంది , ఇంకా నేరాలు చేసే అవకాశం వుంది, ఇతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ పోలికలతో గానీ ఎవరైన అనుమానస్పందంగా కనిపించిన గానీ 100 నంబరు కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం అందించండి. ఈ దొంగ ఆచూకీ తెలిపిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడును మరియు తగిన పారితోషికం కూడ ఇవ్వబడును.మహబూబాబాద్ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు.