Telugu News

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న వేంసూరు పోలీస్ స్టేషన్

0

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న వేంసూరు పోలీస్ స్టేషన్

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ అవార్డును ఖమ్మం జిల్లాలోని వేంసూరు పోలీస్‌ స్టేషన్‌ దక్కించుకుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. .

రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు..
ఖచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన విచారణ, ప్రోయాక్టివ్ పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మొదలైన రక్షణ క్రియాత్మక రంగాలలో వారు సాధించిన ప్రతిభ అధారంగా పలు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు కేటగిరీలలో నాలుగు పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. కేటగిరీ -1 (1-200 ఎఫ్‌ఐఆర్‌ల కేటగిరీ)లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేశారని తెలిపారు.

ఉత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో భాగంగా,
2021 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి ఉత్తమ పోలీసు స్టేషన్లు గా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిందని తెలిపారు.
ఈరోజు హైదరాబాదులో రాష్ట్ర డీజీపీ యం. మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ను ఎస్సై సాయి ( ప్రస్తుతం ఏన్కూర్ PS ) అందుకున్నారు.

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైన వేంసూరు మునుపటి SI సాయి కుమార్ మరియు ప్రస్తుత SI మరియు సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

also read :-క్రీడలతో దేహ దారుడ్యం సొంతం