Telugu News

**కాంగ్రెస్ నేతలు రేవంత్, కొమటిరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు

రేవంత్ రెడ్డి ఇంటి ముందు బారీగా మోహరించిన పోలీసులు

0

***కాంగ్రెస్ నేతలు రేవంత్, కొమటిరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు

***రేవంత్ రెడ్డి ఇంటి ముందు బారీగా మోహరించిన పోలీసులు

***అక్రమ అరెస్టు లతో..నిర్బంధ కాండతో ప్రజా ఉద్యమాలు అణచలేరు..

***కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది..కోమటిరెడ్డి ఆగ్రహం

***(ఖమ్మం విజయం న్యూస్):-

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పై కేసు నమోదు చేయమంటే..కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం విడ్డురంగా ఉందని కాంగ్రెస్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్ లు..నిర్బంధ కాండతో ప్రజా ఉద్యమాలను.. ప్రతిపక్షాల గొంతును కేసీఆర్ ప్రభుత్వం నొక్కేస్తుందని..టిఆర్ఎస్ పాలనకు కాలం చెల్లిందని దుయ్యబట్టారు.

also read :-===కెసిఆర్‌ది అసలైన తెలంగాణ భాష: మంత్రి హారీష్ రావు

ప్రతి దానికీ పోలీసులను ప్రయివేటు సైన్యం లా వినియోగించడం ప్రజా స్వామ్యనికి మంచిది కాదని..కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందని గ్రహించి అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఉక్కు పాదంతో అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.