Telugu News

ఖమ్మం లో నకిలీ విత్తనాల పై పోలీస్ నజర్.

విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

0

ఖమ్మం లో నకిలీ విత్తనాల పై పోలీస్ నజర్.

== ఇక నుంచి నకిలీ విత్తనాల దుకాణాలపై అకస్మిక తనిఖీలు 

== నకిలీ విత్తనాల కట్టడికి 21 జాయింట్ టాస్క్ ఫోర్స్‌ బృందాలు…క్షేత్రస్ధాయిలో నిరంతరం పర్యవేక్షణ..*

== దుకాణాల్లో, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు*

== నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు*

== అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దులో నిఘా వ్యవస్థ పటిష్టం*

== విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

(ఖమ్మం క్రైం -విజయం న్యూస్)

నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.

నకిలీ,కల్తీ విత్తనాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీసు బలగాలతో 21 జాయింట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసిన, దుకాణాలలో, ఏజెంట్లు,మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించిన తీవ్రమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా నకిలీ విత్తనాల విక్రయాలలో గతంలో కేసులు నమోదైన వారిపై నిఘా వుంటుందన్నారు. తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని అన్నారు.

ప్రధానంగా గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లో విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. అదే విధంగా ఏ ప్రాంతంలోనైనా కచ్చితమైన కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే స్దానిక పోలీస్ స్టేషన్ కు కాని, మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా పరిధిలోని విత్తన ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

నకిలీ విత్తనాల సమస్యలను నియంత్రించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సమాచారం వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు తెలిపారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి దుకాణాదారు నుంచి రశీదు తీసుకోవాలన్నారు. నగరంతో పాటు మండలల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ వుంటుందని,

పి ఆర్ వో