Telugu News

ప్రమాదాల నివారణకు పోలీసుల ముందస్తు చర్యలు

ఏనుకూరు, విజయం న్యూస్

0

ప్రమాదాల నివారణకు పోలీసుల ముందస్తు చర్యలు

(ఏనుకూరు, విజయం న్యూస్):-

ఏనుకూరు లో ప్రమాదాల నివారణకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో పోలీసులు ప్రమాద నివారణ బోర్డులను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట,జన్నారం క్రాస్ రోడ్డు దగ్గర వీటిని ఏర్పాటు చేశారు. వాహనాలు క్రమపద్ధతిలో వచ్చే విధంగా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉండే విధంగా, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు, దీంతోపాటు స్మగ్లింగ్ దారులను నిరోధించేందుకు ఇవి దోహద పడనున్నాయి. గతంలో ఇవి లేనప్పుడు జన్నారం క్రాస్ రోడ్ దగ్గర వాహనాలు వేగంగా వచ్చి అదుపుతప్పి ప్రమాదాలకు గురైన సంఘటనలెన్నో ఉన్నాయి.

also read :-అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారుల వాటా ఎంత?

దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సై సాయి కుమార్ గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యగా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటి వలన ప్రమాదాలు కూడా తగ్గాయని ఎస్ఐ తెలిపారు. మరికొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అదే విధంగా ఏనుకూరు ప్రధాన సెంటర్ నుండి టి యల్ పేట వైపు వెళ్లే రోడ్డు ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం రద్దీగా ఉంటుంది . దీంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఈ సెంటర్లలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.