Telugu News

కానిస్టెబుల్ పరీక్ష కు వెళ్లే వారు ఇవ్వి పాటించండి

== యువతి,యువకులకు ఆల్ దిబెస్ట్ 

0

కానిస్టెబుల్ పరీక్ష కు వెళ్లే వారు ఇవ్వి పాటించండి

== తప్పని సరి చేస్తే గ్యారంటీ

== యువతి,యువకులకు ఆల్ దిబెస్ట్ 

(ఖమ్మం-విజయంన్యూస్)

రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టెబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఆదివారం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాధి మంది యువతీయువకులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. టీఎస్ఎల్ఫీఆర్బీ, జేఎన్టీయుహెచ్  ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్  ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాలలో  39,551 మంది అభ్యర్థులు కానిస్టేబుళ్ళ ఆర్హత రాత పరీక్షకు  హజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో ఖమ్మం నగరం, పరిసరాల పరిధిలోని 89 పరిక్ష కేంద్రాలలో 31,415 మంది అభ్యర్థులు, అదేవిధంగా  సత్తుపల్లిలోని 16 పరిక్ష కేంద్రాలలో 8,136 మంది అభ్యర్థులు పరిక్ష వ్రాయనున్నారని తెలిపారు. అయితే రాతపరీక్షకు హాజరైయ్యే యువతి,యువకులు ఇవి పాటిస్తే కచ్చితంగా మార్గం సులువు చేసుకోవచ్చు. అందులో కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతున్నాం.

ఇది కూడా వీలుంటే చదవండి :నేడు కానిస్టెబుళ్ల ప్రిలిమినరీ రాతపరీక్ష్

  • రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావల్సి వుంటుంది.
  • హాల్ టిక్కట్ నెంబర్ ప్రకారం ఏ రూమ్ లో మీ నెంబర్ ఉందో ఒక్క సారి చూసుకుని రాండి.. తరువాత రూమ్ కోసం పరుగులు తీసే అవకాశం ఉండదు..
  • పరీక్షకు సంబంధించి నియమ నిబంధనలు హాల్ టికెట్లో పొందుపరిచి వుంటాయి జాగ్రత్తగా చదువుకుని పాటించాల్సి ఉంటుంది..
  • పరీక్ష గదిలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో ఇతర వస్తువులను అనుమతించరు.. ఈ విషయం మర్చిపోవద్దు.
  • ముఖ్యంగా రాతపరీక్షకు హాజరైయ్యేవారు మానసికంగా ధృడంగా ఉండాలి.
  • ఎటువంటి భయాందోళనకు గురికాకూడదు. ఏం ప్రశ్నలు వస్తాయి.. ఎలా రాయాలి.. రాస్తానో లేదో..? ఈజీ ప్రశ్నలు వస్తాయో రావో..? నేను చదివినవి వస్తాయో రావో..? అంటూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.. కచ్చితంగా మానసికంగా స్థిరంగా ఉండాలి..
  • మరీ ముఖ్యంగా మానసిక శక్తి స్ట్రాంగ్ గా ఉండి..వేరేవేరే ఆలోచనలు తగ్గించాలి.. చదువుకున్నవి మాత్రమే ఆలోచించాలి.
  • పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాడాహుడిగా, పరుగులు తీస్తు వెళ్లకండి.. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
  • చాలా మంది పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు పుస్తకాలు తీసుకుని చదువుతూ ఉంటారు.. అలా చదవడం వల్ల ఇప్పుడు చదివినవి మాత్రమే గుర్తు ఉండే అవకాశం ఉంటుంది.. ఇన్ని రోజుల పాటు చదవినవి జ్జాపికం వచ్చే అవకాశం ఉండదు.. అందుకే పరీక్షకంటే గంట ముందు చదువుకు దూరంగా ఉండండి..
  • ఆ సమయంలో మీరు చదువుకున్నది ఒక్క సారి జ్జాపకం తెచ్చుకోండి.. మరీ ముఖ్యంగా మీరు పరీక్ష కేంద్రానికి వెళ్లిన తరువాత ప్రశాంతంగా ఉండండి..టెన్షన్ కు గురికావోద్దు.
  • పరీక్ష కేంద్రంలోకి వచ్చిన తరువాత ఒక్క సారిగా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొండి
  • పరీక్ష పేపర్ పట్టుకున్న తరువాత హాడాహాడిగా రాయడం, ప్రశ్నలకు అన్సర్ ఇవ్వడం ప్రారంభించకండి
  • పరీక్ష్ పేపర్ ను మొత్తం చదవండి.. అందులో మీకు టక్కీమని వచ్చే సమాధానాలను ముందుగా రాయండి.
  • రాని ప్రశ్నలకు ముందుగానే ఆలోచించి సమయాన్ని వుధా చేయకండి.. వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి.
  • ఆ తరువాత ఒక5  సెకన్లపాటు రిలీఫ్ అవ్వండి.. ఆ తరువాత మళ్లీ ఎగ్జామ్ రాయడం ప్రారంభించి కొంచం ఈజీగా ఉన్న ప్రశ్నలను ప్రయత్నం చేయండి.. అవి పూర్తి చేసిన తరువాత ఇంకా కొంచం హార్డ్ గా ఉన్న ప్రశ్నలకు ఆలోచించి సమాధానం రాయండి
  • ఈ సమయంలో ఎక్కడ కూడా టెన్షన్ కు గురి కాకండి.. ప్రశాంతంగానే ఉంటూ పరీక్షలు రాస్తే సమాధానాలు కూడా అలాగే వస్తాయి.. టెన్షన్ పడితే వచ్చిన సమాధానాలను కూడా మీరు ఆలోచించే శక్తిని కోల్పోతారు.. తద్వార తరువాత బాధపడతారు..
  • పరీక్ష కేంద్రానికి వెళ్ల కంటే ముందుగా 1గంట పాటు సెల్ పోన్ న్ను యూజ్ చేయకండి.. అవసరం ఉంటే, అత్యవసరమైతే సైలెంట్ లో పెట్టండి..లేదంటే పూర్తిగా స్వీచ్ ఆప్ చేయండి.. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా తోడుగా వస్తుంటే మీ పోన్ న్ను ఇంట్లోనే వదిలివెళ్లండి
  • అనుకున్న సమయంలోపు మీరు పరీక్ష రాయడం అయిపోతే వెంటనే ఇన్వూజిలెటర్ కు మీ పేపర్ ఇచ్చి బయటకు రాకండి.. జాగ్రత్తగా మరోసారి రాసిన సమాధానాలను, ప్రశ్నపేపర్ ను చూడండి..
  • చివరి నిమిషం వరకు పేపర్ ను రాసేందుకు ప్రయత్నం చేయండి. ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా సమాధానం రాయండి.. ఖాళీగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకొండి.

మాకు తెలిసిన, మాకు మా గురువులు నేర్పిన మాటలను మాత్రమే మీ ముందు ఉంచాము.. ఇవే ప్రామాణికం కాదు.. నచ్చితే పాటించోచ్చు… నచ్చపోతే వదిలేయోచ్చు..

ఆల్ దిబెస్ట్ ప్రెండ్స్..

ఇది కూడా చదవండి : నేడు భారత్‌,పాక్‌ క్రికెట్ మ్యాచ్‌