Telugu News

ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద భట్టి ఆందోళన.

** టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గంటల కొద్ది పోలింగ్ కేంద్రంలో ఎందుకుంటున్నారని ప్రశ్నించిన భట్టి

0

ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద భట్టి ఆందోళన
** టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గంటల కొద్ది పోలింగ్ కేంద్రంలో ఎందుకుంటున్నారని ప్రశ్నించిన భట్టి
** ఇద్దరు పోలీస్ అధికారులు మంత్రికి పేవర్ గా చేస్తున్నారని ఆరోపణ
** ఖమ్మం జిల్లా రాజకీయాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం
** మంత్రి, కమలరాజ్, కందాళ పోలింగ్ కేంద్రంలో ఎలా కుర్చుంటారు
** పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారని పోలీసులను ప్రశ్నించిన భట్టి
** జాతీయ పార్టీ కార్యాలయంలో పోలీసులకేం పని
** ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన భట్టి
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన చేశారు. భట్టి పోలింగ్ కేంద్రం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం తీవ్రంగా స్పందించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గంటల తరబడి పోలింగ్ కేంద్రంలో ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఈసీ నిబంధనలు పాటిస్తారనే నమ్మకం కలెక్టర్ పై ఉందని, కానీ అధికార పార్టీకి తొత్తులుగా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు పోలీసాధికారులు కావాలనే ఖమ్మం జిల్లాను, జిల్లా రాజకీయాలను నాశనం చేస్తున్నారని, వారు ఖమ్మంకు రాకముందు జిల్లాలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, వారు వచ్చిన తరువాత జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగి దాఖలాలే లేవని పేర్కొన్నారు.

నేను ఓటు వేయడానికి ఎంత సమయం తీసుకున్నా..? మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్ ఓటు వేయడానికి ఎంత సమయం తీసుకున్నారో సీసీ కెమోరాల పుటేజీని చూస్తే అర్థమవుతుందన్నారు. పోలీసులు ఇలా పక్షపాతంగా వ్యవరించడం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వాలు ఇప్పుడుంటాయి పోతాయి.. కానీ ప్రభుత్వ ఉద్యోగం, పోలీసు ఉద్యోగం అట్ల పోయిది కాదు, 60 ఏళ్లపాటు చేసుకునే ఉద్యోగం అని అన్నారు. నాలుగేళ్లు, ఐదేళ్లు ఉండే ప్రభుత్వాలకు కొమ్ముకాస్తే, జీవితంలో మంచి ఉద్యోగం చేయలేరని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపిస్తారని ఆశ ఉండేదని, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని అనుకోలేదని ఆరోపించారు. పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటు హక్కు లేదని, కానీ ఆయన పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్తారో చెప్పాలని ప్రశ్నించారు.
** పార్టీ కార్యాలయంలోకి వెళ్లడానికి పోలీసులకు హక్కుందా.?
ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద తప్పులు జరుగుతున్నాయని స్వయంగా అభ్యర్థి ఫిర్యాదు చేసిన పట్టించుకుని పోలీసులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తే, వారిని ఇష్టానుసారంగా నెట్టేసి, వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఏంటనీ ఖమ్మం నగర ఏసీపీని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఏహక్కుతో జాతీయ పార్టీ కార్యాలయంలోకి మీరు అడుగు పెడతారు, అక్కడ పార్టీ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద చాలా తప్పులు జరుగుతున్నాయని, వీటన్నింటిపై కచ్చితంగా వెబ్ కాస్టింగ్ సీసీ పుటేజీల ద్వారా ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
** మంత్రి, జడ్పీచైర్మన్ పోలింగ్ కేంద్రంలో ఉండి ఓటర్లను బెదరిస్తున్నారు : రాయల నాగేశ్వరరావు
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజ్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ఖమ్మం పోలింగ్ కేంద్రంలో గంటల కొద్ది ఉంటూ ఓటర్లను బెదరింపులకు గురిచేసి ఓట్లు వేయించుకుంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. గంటల కొద్ది తిరుగుతుంటే నేనే స్వయంగా పోలింగ్ కేంద్రం రిటర్నింగ్ అధికారి సురభికి ఫిర్యాదు చేశానని, కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, స్పందించలేదని ఆరోపించారు. దీంతో పార్టీ నాయకులతో గట్టిగా పోలీసులను అడిగితే మమ్మల్నే పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తీసుకొచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించారని, అరెస్టు చేసి స్టేషన్కు తరలించారని ఆరోపించారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో చాలా దారుణం జరుగుతుందన్నారు. కచ్చితంగా ఈసీ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
** ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకుల ఆందోళన
ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రంలోనే గంటలకొద్ది తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు పోలింగ్ కేంద్ర రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగర కమీషనర్ సురబీ కి ఫిర్యాదు చేశారు. అయినప్పటికి అధికారులు స్పందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే ఓటర్లను బెదిరింపులకు దిగుతున్నారని, గంటలకొద్ది పోలింగ్ కేంద్రంలోనే తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తు ఓట్లు వేయించుకుంటున్నారని రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. దీంతో పోలీసులు ఆందోళన కారులు అరెస్టు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు వెళ్లి ఆఫీసులో ఉన్న నాయకులను అరెస్టులు చేశారు. ఆ తరువాత సాయంత్రం విడుదల చేశారు.

also read :-ఆధునిక దేవాలయానికి 67 వసంతాలు