Telugu News

ప్రజల ప్రేమాభిమానాలే శాశ్వతం:మాజీ ఎంపీ పొంగులేటి

కూసుమంచి విజయం న్యూస్

0

ప్రజల ప్రేమాభిమానాలే శాశ్వతం:మాజీ ఎంపీ పొంగులేటి

(కూసుమంచి విజయం న్యూస్):-

పదవులు శాశ్వతం కాదని ప్రజలు తమపై చూపే ప్రేమాభిమానాలే శాశ్వతం అని ఇదే విషయాన్ని ప్రతి ప్రజా ప్రతినిధి గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా గైగొల్లపల్లి ఎంపీటీసీ మంగ్యానాయక్ ఇటీవల గుండె సర్జరీ చేయించుకోగా అతడిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసకున్నారు. మల్లాయిగూడెం గ్రామంలో జవ్వాజి లింగయ్య మనుమడు వివాహం సందర్భంగా దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు.

also read :-నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వైరా లో 150 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాల అందజేత

లోక్యాతండా గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు చనిపోయినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పొంగులేటి వెంట ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాంకుమార్, బారీ వీరభద్రం, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మాలీదు జగన్, పాపారావు, కేశవరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, జక్కుల వెంకటేశ్వర్లు తదితరుతు పాల్గొన్నారు.