Telugu News

దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్

0

***దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ
***(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్):-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర రావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఐదు వేల మొక్కలు నాటే లక్ష్యంతో చేపట్టిన మెగా ప్లాంటేషన్ లో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తో కలిసి మొక్కలు నాటి మంత్రి ప్రారంభించారు.

also read:-ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు…..

అధికారులు ప్రజా ప్రతినిధులతో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర రావు గత ఏడున్నర సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని వినూత్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకువెళుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చి దిద్ది దేశానికి ఆదర్శంగా నిలిపారని మంత్రి అన్నారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పండుగల ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారని మంత్రి అన్నారు.శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్, మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,
జెడ్ పి టి సి ప్రియాంక, ఎంపీపీ గౌరీ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్ష్ సురభి, జిల్లా పరిషత్ సీఈఓ అప్పారావు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యా చందన, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, మండల, జిల్లాస్థాయి అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లా పౌరసంబంధాల అధికారి ఖమ్మం వారిచే జారీ చేయడమైనది.