Telugu News

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకోచ్చా : మంత్రి

▪️మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, మార్చురీ గదిని ప్రారంభం.

0

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకోచ్చా : మంత్రి

▪️మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, మార్చురీ గదిని ప్రారంభం.

▪️ రేడియాలజీ ల్యాబ్ కుశంకుస్ధాపన..

▪️పేదలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి..

– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన‘మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, నూతన మర్చరి గది ని ప్రారంభించి, రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు చేయడమైందన్నరు.తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలి ఆని, పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు.కానీ ప్రసవం తర్వాత అనేక మంది తల్లులకు పాలు పడడం లేదని, గర్భిణులుగా ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం ఒక కారణమైతే మరికొందరిలో జీవన వ్యవహారం, మానసిక స్థితి మరో కారణమని వైద్యులు పేర్కొంటున్నారని వివారించారు..

also read :-సార్.. మంచినీళ్ళు ఇప్పంచండి..

దవాఖానలో ప్రసవించిన మహిళల నుంచి, బయటి బాలింతల నుంచి తల్లిపాలను సేకరించి అదె హైజినిక్ పద్దతులతో పాలు రాని బాలింతలకు అందించడం జరుగుతుందన్నారు.ఖమ్మం పెద్దాసుపత్రిలో రోజుకు 20 నుంచి 40 వరకు కాన్పులు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అనేక మంది తల్లులకు ప్రసవం జరిగిన వెంటనే పాలు పడడం లేని కారణంగా వారంలోపు పసివాళ్లకు తల్లిపాలే తాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మదర్‌ మిల్క్‌ బ్యాంక్ లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.

also read :-ముస్లింమైనార్టీ సోదరులకు దుస్తులు పంపిణీ

ఈ తరహా విధానం హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీవలే వరంగల్‌లోనూ ప్రారంభించరని, నేడు ఈ సౌకర్యం ఖమ్మంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చామని వివారించారు. కాగా పసి బిడ్డలకు పాలు పట్టించే కేంద్రంగా రాష్ట్రంలోనే ఖమ్మం మూడవస్థానంలో నిలువడం గర్వంగా ఉందన్నారు.మనిషి చనిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని భద్రపరచడం, ఏవైనా పోలీసు కేసులు నమోదైతే పోస్టుమార్టం కోసం ఖమ్మం పెద్దాసుపత్రిలో అత్యాధునిక మార్చురీ గదిని నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుత గది అసౌకర్యంగా ఉన్నందున వైద్యాధికారులు విషయాన్ని పలు మార్లు తన దృష్టికి తీసుకువచ్చారని అందుకే నూతన గదిని నిర్మించామన్నారు.

also read :-పినపాకలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన…..

అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోనే రూ.75 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ భవనాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో అల్ట్రాసౌండ్‌, సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ, మెమోగ్రామ్‌, ఎక్స్‌రే విభాగాల సేవలన్నీ రోగులకు ఒకేచోట లభించనున్నాయని, తద్వారా రోగం కచ్చితంగా నిర్ధారణ అయి రోగులకు చికిత్సలు మరింత సులభతరం అవుతుందన్నారు.

కార్యక్రమంలో మయర్ పునుకొల్లు నీరజ జడ్పి చైర్మన్ లింగాలకమల్ రాజ్, సుడా ఛైర్మెన్ విజయ్ , జిల్లా కలెక్టర్ VP గౌతమ్ , DM&HO మాలతీ , మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు, వైద్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.