****పిలిస్తే పలుకుతా..! తోచిన సాయం చేస్తా..: పొంగులేటి
*** ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
****పిలిస్తే పలుకుతా..! తోచిన సాయం చేస్తా..: పొంగులేటి
*** ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
***(ఖమ్మం విజయం న్యూస్):-
ఖమ్మం : ఆపదలో ఉన్నా మమ్మల్ని ఆదుకోండి శీనన్న అని ఒక్కసారి పిలవండి చాలు… తక్షణం స్పందించి తోచిన సాయం చేయడంలో ముందుంటానని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, పెనుబల్లి, వైరా, ఖమ్మం నగరాల్లో పర్యటించారు. వివిధ కారణాలతో మృతిచెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఆర్థికసాయం చేశారు. పలు వివాహాది శుభకార్యక్రమాలకు, ఓణీల అలంకరణ వేడుకలకు, ఇతరత్రా శు భకార్యాలకు హాజరై ఆశీర్వదాలను అందజేసి నూతన వస్త్రాలను బహుకరించారు.
also read :-
పలు మండలాల్లోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను, నాయకులను, పొంగులేటి అభిమానులను ఉ ద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎలాంటి పదవిలేకున్నా ప్రజా సేవ చేసే భాగ్యం నాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కల్పించడం అదృష్టమన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తు రోజుల్లోనూ కొనసాగిస్తానని తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నన్ను ఆదరిస్తున్న ప్రజలను మరవబోనని వారి ఆశీస్సులతోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, యాసా వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్, మట్టూరి జనార్ధన్, సర్పంచ్ మోహన్, యాసా శ్రీకాంత్, ఏనుగు సత్యంబాబు, బత్తుల రాము, మందపాటి ముత్తిరెడ్డి, మురళీరెడ్డి, గ్రాండ్ మౌలాలీ, తోట గణేష్, కమల్ పాషా, చల్లారి వెంకటేశ్వరరావు, బేతిని శ్రీనివాసరావు, ఉబ్బన శ్రీనివాసరావు, నోటి కృష్ణారెడ్డి, తూము నర్సింహారావు, ప్రహల్లాద, నల్లగట్ల పుల్లయ్య, కాస్టాల నరేంద్ర, అభిలాష్, వేమిరెడ్డి వెంకట్ రెడ్డి, మచ్చా వెంకటేశ్వరరావు, ఆళ్లకుంట నర్సింహారావు, దామళ్ల సురేష్, బండి వీరబాబు, పుల్లారావు, పాపారావు, రామకృష్ణ, మానస నాని, కొండపల్లి మహేష్, మల్లూరి దిలీప్, విరివాడ అజయ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.