Telugu News

తుడుందెబ్బ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా బురస.పోచయ్య ఎన్నిక.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి శాశ్వత రాజకీయ ల వైపు సోయాం ప్రయాణం

0

తుడుందెబ్బ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా బురస.పోచయ్య ఎన్నిక.

===రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి శాశ్వత రాజకీయ ల వైపు సోయాం ప్రయాణం.

===లంబాడీ ల తొలగింపు కి ఎంపీ హోదా లో పోరాటం చేస్తానని వెల్లడి.

(ఈ డి యన్ ప్రసాద్ మణుగూరు రూరల్ విజయం న్యూస్):-

సోమవారం నాడు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం జిల్లా కేంద్రం లోని ప్రేమల గార్డెన్ లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశం కి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయాం,బాబురావు ఆదిలాబాద్ ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం లో తుడుందెబ్బ భవిష్యత్ ఉద్యమ కార్య చరణ పై చర్చ చేయగా, భవిష్యత్ ఉద్యమ కార్య చరణ దృష్ట్యా రాజకీయంగా ఉన్న నేను తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదు అని సంఘం పై రాజకీయ ప్రచారం జరిగే క్రమం లో నేను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు, ఇంత కాలం సంఘం లో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు,

also read :-రోడ్డు ప్రమాదంలో తండ్రి మతి

రాజకీయంగా పూర్తి స్థాయిలో పార్టీ కి పని చేయనున్నట్లు తెలిపారు.లంబాడీ ల తొలగింపు విషయం లో ఒక ఎంపీ గా పోరాటం చేయటం జరుగుతుంది అని పోరాటం ఆపేది లేదు అన్నారు, పార్లమెంట్ స్థాయిలో డాక్యుమెంటేషన్ చేసి సుప్రీం కోర్టు కి అందజేయనున్నట్లు తెలిపారు. రాజకీయులు సంఘం ఒకటి కాదు అని అందుకే అధ్యక్ష పదవి నుండి తప్పుకొని తుడుందెబ్బ ను బలోపేతం చేస్తాను అని తెలిపారు.అనంతరం సమావేశం అయిన రాష్ట్ర కమిటీ నూతన రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నిక చేసింది తుడుందెబ్బ వ్యవస్థాపక సభ్యులు అయిన బురస.పోచయ్య ని ఏక గ్రివంగ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక చేయటం జరిగింది, సోయ్యం,బాబురావు ని గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

also read;-ఈ నెల 7న మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్య‌ట‌న‌

10 రోజులలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాటు చేసి భవిష్య త్ ఉద్యమ కార్య చరణ చేయనున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది.ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల.రవీందర్, సిద్ధ బోయిన.లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు మోతీరాం, రాష్ట్ర కార్యదర్శి ముక్తి,రాజు. కల్తీ,సత్యనారాయణ.అలెం కోటి,గోగ్గెల.రామస్వామి, అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొడప.నాగేష్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొట్నక.విజయ్ పాటు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.